Share News

ఆక్వాకు వరం!

ABN , Publish Date - Aug 12 , 2026 | 06:08 AM

రాష్ట్రంలోని ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆక్వా సాగు ఆర్థికంగా భారం అవుతున్న సమయంలో వారికి ఊరట కల్పించింది. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా విధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తివేస్తూ...

ఆక్వాకు వరం!

యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కే..

అర్హులైన రైతులందరికీ వర్తింపు

  • గత వైసీపీ ప్రభుత్వ ఆంక్షలు ఎత్తివేత

  • ఆక్వా, నాన్‌ ఆక్వా జోన్‌లు, 10 ఎకరాల పరిమితితో సంబంధం లేకుండా అమలు

  • రీ సర్వేతో కొత్తగా నోటిఫై చేసిన ఆక్వా జోన్లలోని అన్ని ఫారాలకూ..

  • జూన్‌ 1 నుంచే అమలుకు ఉత్తర్వులు

  • 2018లోనే ఆక్వా రంగానికి విద్యుత్తు రాయితీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం

  • ఆ తర్వాత జగన్‌ సర్కార్‌ అనాలోచిత నిబంధనలతో రైతులకు దక్కని రాయితీ

  • కూటమి ప్రభుత్వం చొరవతో అధిక శాతం రైతులకు మళ్లీ ఊరట

గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిబంధనలతో ఆక్వా రైతులు పడిన ఇబ్బందులకు కూటమి ప్రభుత్వం చెక్‌ పెట్టింది! ‘ఆక్వా’ రంగానికి తిరిగి జవసత్వాలు నింపుతూ ఓ కీలక వరం ఇచ్చింది!! ఉత్పత్తి వ్యయం తగ్గించేలా.. అర్హులైన రైతులందరికీ యూనిట్‌ విద్యుత్తును రాయితీపై రూ.1.50కే అందించాలని నిర్ణయించింది. జగన్‌ సర్కార్‌ హయాంలో విధించిన ఆక్వా, నాన్‌ ఆక్వా జోన్‌ల మెలిక, 10 ఎకరాల పరిమితి నిబంధనలను ఎత్తివేసింది. జూన్‌ 1 నుంచే విద్యుత్తు రాయితీ అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు ఇచ్చింది.

అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆక్వా సాగు ఆర్థికంగా భారం అవుతున్న సమయంలో వారికి ఊరట కల్పించింది. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా విధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తివేస్తూ.. యూనిట్‌ విద్యుత్తును రాయితీపై రూ.1.50కే సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్తు శాఖ మంగళవారం జీవో-57 విడుదల చేసింది. గత జగన్‌ సర్కార్‌ ఆక్వా జోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌ అంటూ తీసుకొచ్చిన మెలిక, అలాగే 10 ఎకరాల పరిమితి నిబంధనతో సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచే అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన రీ సర్వే ద్వారా కొత్తగా గుర్తించి, నోటిఫై చేసిన ఆక్వా జోన్లలోని అర్హత కలిగిన అన్ని ఆక్వా ఫారాలకు కూడా ఈ విద్యుత్తు రాయితీ వర్తిస్తుంది. ఇప్పటి వరకు యూనిట్‌ రూ.3.85 చెల్లిస్తూ వస్తున్న ఆక్వా రైతులకు ఈ నిర్ణయంతో ఉత్పత్తి వ్యయం తగ్గనుంది. వైసీపీ హయాంలో ఆక్వా, నాన్‌ ఆక్వా జోన్ల పేరుతో అధిక శాతం రైతులు విద్యుత్తు రాయితీని కోల్పోయి.. యూనిట్‌కు రూ.3.86 చెల్లిస్తూ వచ్చారు. దీంతో కూటమి వచ్చిన తర్వాత రీసర్వే చేపట్టి నాన్‌ ఆక్వా జోన్‌ రైతులకూ ఊరట కల్పించారు. ఏపీ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ఏపీఎ్‌సఏడీఏ), కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ (సీఏఏ) చట్టాల కింద ఇప్పటి వరకు నమోదైన సుమారు 6500 ఫారాలకు ఈ విద్యుత్తు రాయితీ వర్తిస్తుంది. భవిష్యత్తులో ఏపీఎ్‌సఏడీఏ, సీఏఏ గుర్తింపు పొందే ఫారాలకు అవి రిజిస్ట్రేషన్‌ పొందిన తేదీ నుంచి సబ్సిడీ రానుంది.


0.9-0.95 పవర్‌ ఫ్యాక్టర్‌ సాధించాలి

విద్యుత్తు రాయితీ వర్తింపునకు ‘పవర్‌ ఫ్యాక్టర్‌’ నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. లబ్ధిదారులైన ఆక్వా రైతులు 2027 మార్చి నాటికి 0.9 నుంచి 0.95 పవర్‌ ఫ్యాక్టర్‌ను సాధించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా పవర్‌ ఫ్యాక్టర్‌ సాధించని ఫారాలు రా యితీని కోల్పోతాయి. ఆక్వాకల్చర్‌ చెరువుల్లో ఆక్సిజన్‌ కోసం పెద్దసంఖ్యలో ఎరేటర్లను నిరంతరాయంగా వాడుతుంటారు. వీటితోపాటు పంపులు, మోటార్ల వినియోగం ఉంటుంది. పాత మోటార్ల వాడకం, నాణ్యత లేని కెపాసిటర్ల వినియోగం కారణంగా పవర్‌ ఫ్యాక్టర్‌ 0.7కి పడిపోతుంది. దీనివల్ల విద్యు త్తు లైన్లపై అదనపు లోడు పడుతుంది. విద్యుత్తు సరఫరా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. రాయితీ కారణంగా విద్యుత్తు శాఖపై పడే భారానికి అదనం గా సరఫరా నష్టాలు కూడా తోడైతే అది మోయలేని భారంగా మారుతుంది. ఈ కారణంగానే పవర్‌ ఫ్యాక్టర్‌ నిబంధనను తెచ్చింది.

ఆక్వా రైతులపై వైసీపీ ప్రభుత్వం పగ!

ఆక్వా రైతుల మేలును దృష్టిలో ఉంచుకుని 2018 లో అప్పటి టీడీపీ ప్రభుత్వం యూనిట్‌ విద్యుత్తు ధరను రూ.3.86 నుంచి రూ.2కి తగ్గించింది. మళ్లీ 2019లో యూనిట్‌ ధరను 1.50కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆ తర్వాత వైసీపీ రావడంతోనే ఆక్వా రైతులపై పగబట్టింది. 2022లో అప్పటి వరకు ఆక్వా రైతులందరికీ వర్తిస్తున్న విద్యుత్తు రాయితీని కొందరికే పరిమితం చేసింది. 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు రాయితీ వర్తించేలా నిర్ణయం తీసుకుంది. దీనిపై విమర్శలు రావడంతో పరిమితిని 10 ఎకరాల కు పెంచింది. ఇదే సమయంలో ఆక్వా, నాన్‌ ఆక్వా జోన్‌ అంటూ మెలిక పెట్టింది. దీంతో అధిక శాతం ఆక్వా రైతులకు విద్యుత్తు రాయితీ అందలేదు.


చంద్రబాబు సీఎంగా ఉండడం ప్రజల అదృష్టం: అచ్చెన్న

  • పాలకొల్లులో ‘ఆక్వా జీవో’ కాపీలను విడుదల చేసిన మంత్రులు

పాలకొల్లు అర్బన్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50 పైసలకే విద్యుత్‌ అందించే జీవో 57 కాపీలను పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంగళవారం జరిగిన ఆక్వా రైతుల మహాసభలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవి, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. అచ్చెన్నాయుడు మా ట్లాడుతూ అనుభవం కలిగిన నేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు. చంద్రబాబు ముందుచూపు వల్ల వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక పరిస్థితి గాడిలో పడిందన్నారు. జగన్‌కు అధికారంలో ఉండగా సమస్యలు కనపడలేదని, అధికారం కోల్పోయాక ప్రతీ చిన్న అంశాన్ని సమస్యగా చిత్రీకరించి రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వైకుంఠపాళి వద్దని అన్నారు.

ఇవి కూడా చదవండి

భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్

నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

Updated Date - Aug 12 , 2026 | 06:08 AM