Share News

నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

ABN , Publish Date - Aug 11 , 2026 | 09:46 AM

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. 2000లో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎస్‌సీఏ) నుంచి తనను బయటకు పంపడానికి దారితీసిన ఘటనపై తాజాగా స్పందించాడు.

నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్
Harbhajan Singh

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. 2000లో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎస్‌సీఏ) నుంచి తనను బయటకు పంపడానికి దారితీసిన ఘటనపై తాజాగా స్పందించాడు. ఎన్‌సీఏలో శిక్షణ పొందిన తొలి బ్యాచ్‌ ఆటగాళ్లలో హర్భజన్‌ కూడా ఉన్నాడు. బీసీసీఐలో తమ మాటకు ఎదురు చెప్పేవారిని సహించలేని కొందరు ఉండేవారని భజ్జీ ఆరోపించాడు. డైట్ చార్ట్‌ను అనుగుణంగా ఆహారం అందించకపోవడంతో ప్రశ్నించానని.. అందుకే తనను ఎన్‌సీఏ నుంచి పంపించేశారని వెల్లడించాడు. 1998లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన భజ్జీ.. అతడి కెరీర్‌లో 600 వికెట్లు తీశాడు. 2016లో క్రికెట్‌కు గుడ్‌బై చేప్పాడు. తాజాగా భజ్జీ ఓ ఇంటర్వ్యూలో నాటి రోజుల గురించి మాట్లాడాడు.


‘అప్పట్లో ఎన్‌సీఏలో ఆటగాళ్ల కోసం ప్రత్యేక డైట్ చార్ట్ ఏర్పాటు చేశారు. అయితే అందుకు అనుగుణంగా ఆహారం అందించేవారు కాదు. అక్కడి ఆహారం కూడా సరిగ్గా ఉండేది కాదు. డైట్ చార్ట్ ప్రకారం భోజనం పెట్టాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీంతో ఒకరోజు బాగా కోపమొచ్చింది. వెంటనే వెళ్లి ఆ డైట్ చార్ట్ చించేశా. నేను చేసిన ఏకైక తప్పు అదే. దీంతో నన్ను ఎస్‌సీఏ నుంచి బయటకు పంపించేశారు. నేను నా హక్కుల కోసం పోరాడా. నేను ప్రశ్నించకపోతే ఇప్పటికీ అదే డైట్ చార్ట్ ఉండేది. అదే ప్లాన్ కొనసాగేది. నేను ప్రశ్నించినందుకే నాపై చర్యలు తీసుకున్నారు. డైట్ ప్లాన్ మాత్రం మారింది. నన్ను బయటకు పంపడం వేరే విషయం. కానీ ఇందులో నా తప్పేమీ కాదు. ప్రశ్నించడం నా హక్కు. నా హక్కుల కోసం నేను పోరాడాను’ అని హర్భజన్ స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి:

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: పావురాలు.. కోతుల బెడదకు చెక్ పెట్టేలా.. !

మిమ్మల్ని చంపేస్తాం.. గంగూలీ దంపతులకు బెదిరింపు లేఖలు!

Updated Date - Aug 11 , 2026 | 09:46 AM