గ్రామాల్లో పాఠశాలలను బాగు చేసుకుందాం
ABN , Publish Date - Aug 12 , 2026 | 05:47 AM
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరిచేందుకు జాతీయ స్థాయిలో ప్రచారోద్యమాన్ని ఆగస్ట్ 15 నుంచి చేపట్టనున్నట్టు కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు...
తల్లిదండ్రులు బడులకు వెళ్లి వసతులను చూడాలి
వీడియోలు పంపితే సోషల్ మీడియాలో పెడతాం
కొత్త పార్లమెంట్, ప్రధాని ఇల్లు నిర్మించుకున్నాం
మరి కొత్త స్కూళ్లు ఎందుకు నిర్మించలేదు?
సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే వీడియో సందేశం
15 నుంచి దేశవ్యాప్తంగా ‘సర్పంచ్ చాలెంజ్’
న్యూఢిల్లీ, ఆగస్ట్ 11: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరిచేందుకు జాతీయ స్థాయిలో ప్రచారోద్యమాన్ని ఆగస్ట్ 15 నుంచి చేపట్టనున్నట్టు కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. అదే రోజు మహారాష్ట్రలోని ‘హింగోలి’ జిల్లా పరిధిలో తన గ్రామ (సంతూక్ పింప్రి) సర్పంచ్‌ను కలసి, అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కోరనున్నట్టు చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఒక వీడియో సందేశాన్ని దీప్కే విడుదల చేశారు. ‘సర్పంచ్ ఛాలెంజ్’ పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా.. పాఠశాలలను మెరుగుపరిచే బాధ్యతను గ్రామ సర్పంచ్‌లు తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పాఠశాలల అభివృద్ధికి ముందు, తర్వాతి ఫొటోలను సీజేపీకి పంపిస్తే..అలాంటి సర్పంచ్‌లను అభినందిస్తామని ప్రకటించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలకు తప్పకుండా వెళ్లి.. అక్కడ శుభ్రమైన తాగునీరు, విద్యుత్, వాష్‌రూమ్ తదితర వసతులు ఉన్నాయా?.. ఉంటే అవి ఎలా ఉన్నాయో చూడాలని, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించాలని కోరారు. వసతులపై వీడియోలు తీసి వాటిని (ఛిౌుఽ్ట్చఛ్టిఃఛిౌఛిజుట్చౌఛిజ్జ్చిుఽ్ట్చఞ్చట్టడ.ౌటజ) మెయిల్ ద్వారా పంపితే.. సీజేపీ సోషల్ మీడియా పేజీల్లో ప్రదర్శిస్తామని దీప్కే తెలిపారు. ‘‘ఆగస్ట్ 15న 80వ స్వాతంత్య్రదినం. ఈ 80 ఏళ్లలో ఎక్కువ నిర్లక్ష్యానికి గురైనది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలే. నేటికీ గ్రామీణ విదార్థులు పాఠశాలల కోసం ఎంతో దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొత్త పార్లమెంట్ భవనం, కొత్త ప్రధాని ఇంటిని నిర్మించుకున్నాం. మరి మన గ్రామాల్లో కొత్త పాఠశాలలను ఎందుకు నిర్మించుకోలేకపోయాం??’’అని దీప్కే ప్రశ్నించారు. కాగా, రాంచిలో నిరసనకు దిగిన విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను దీప్కే ఖండించారు. విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహతోను దీప్కే ఫోన్‌లో పరామర్శించినట్టు సీజేపీ ప్రకటించింది. పోలీసుల చర్యలపై స్వతంత్ర దర్యాప్తునకు సీజేపీ డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి
భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్
నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్