Share News

10.7 శాతం వృద్ధి.. 2025-26 రెండో త్రైమాసికంలో నమోదు..

ABN , Publish Date - Aug 12 , 2026 | 06:14 AM

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటోంది. సవాళ్లను ఎదుర్కొంటూ వృద్ధి రేటులో దూసుకెళ్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రణాళిక విభాగం మంగళవారం అందజేసిన 2026 జూలై ఆర్థిక నివేదికలో...

10.7 శాతం వృద్ధి.. 2025-26 రెండో త్రైమాసికంలో నమోదు..

  • రెండేళ్ల జాతీయ సగటు కంటే మనదే ఎక్కువ

  • ప్రాజెక్టుల పెట్టుబడుల్లో 75 శాతం,

  • ఎంఎ్‌సఎంఈల్లో 73 శాతం వృద్ధి

  • ప్రణాళిక శాఖ జూలై ఆర్థిక నివేదికలో వెల్లడి

  • ప్రజలపై ధరల భారం లేకుండా చూడండి

  • ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వండి

  • అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటోంది. సవాళ్లను ఎదుర్కొంటూ వృద్ధి రేటులో దూసుకెళ్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రణాళిక విభాగం మంగళవారం అందజేసిన 2026 జూలై ఆర్థిక నివేదికలో అది స్పష్టమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ప్రతీ ప్రభుత్వ శాఖలో లక్ష్యాలను చేరుకునేలా వనరుల నిర్వహణ చేపట్టాలన్నారు. ప్రజలపై ధరల భారం పడకుండా అధ్యయనానికి ఓ కమిటీ వేయాలని ఆదేశించారు. ఎల్‌నినో సంక్షోభం నేపథ్యంలో నీటి లభ్యత, ఉత్పత్తుల విలువ జోడింపుపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. జిల్లా, నియోజకవర్గం, మండలాలవారీ ప్రణాళికల ద్వారా లక్ష్యసాధన సులువవుతుందని చెప్పారు. రెండేళ్ల నుంచి జాతీయ సగటు వృద్ధిరేటు కంటే ఏపీలో ఎక్కువ వృద్ధిరేటు నమోదవుతోందని ప్రణాళిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధిరేటు పెరిగినప్పటికీ కీలక విభాగాల్లో మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో 10.7 శాతం వృద్ధిరేటు నమోదైంది. అంతకుముందు ఏడాది రెండోత్రైమాసికంలో నమోదైన 7 శాతం కంటే ఇది చాలా ఎక్కువ. 2023-24లో మందగమనంలో ఉన్న వ్యవసాయరంగం ఇప్పుడు రెండంకెల వృద్ధి సాధిస్తోంది. 2025-26 తొలి క్వార్టర్‌లో ఈరంగంలో 9.4 శాతం వృద్ధి నమోదు కాగా రెండో క్వార్టర్‌లో 13.5 శాతానికి చేరింది. పారిశ్రామిక రంగంలో అంతకుముందు ఏడాది 5.1 శాతం వృద్ధి నమోదవ్వగా, 2025-26లో రెండింతలు పెరిగి 10.6 శాతానికి చేరుకుంది. సేవారంగం వృద్ధి మొదటి త్రైమాసికంలో 8.5 శాతం నుంచి రెండో త్రైమాసికంలో 9.9 శాతానికి పెరిగింది. సాధారణ ఎగుమతుల్లో రూ. 16,322 కోట్లతో 10.5 శాతం మేర వృద్ధి నమోదైంది. సాంకేతికత అనుసంధానం కారణంగా జీఎస్టీ వసూళ్లు 21 శాతం వృద్ధితో రూ. 13,282 కోట్లకు చేరాయి. ఎల్‌నినో కారణంగా ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 51.8 శాతం మేర లోటు వర్షపాతం నమోదైంది.


వ్యవసాయం అనుబంధ రంగాల్లో వృద్ధి ఇలా..

  • 2025-26లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 39.8ు పెరిగింది. 2026 ఏప్రిల్‌-జూన్‌ మధ్య కూరగాయలు 44.8ు, ఆయిల్‌పామ్‌ 36.8ు, ఇతర మసాలా దినుసులు 304.6ు మేర బలమైన వృద్ధి కనబర్చాయి. 2025-26లో పండ్లు 15.7 శాతం, తోట పంటలు 10 శాతం, మల్లె, చామంతి 8.2 శాతం, మామిడి 4.7 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.

  • 2025-26లో నూనెగింజల ఉత్పత్తి 15.7 శాతం తగ్గింది. మిరప, నల్ల మిరియాలు, పసుపు ఉత్పత్తి 17.9 శాతం క్షీణించింది.

  • ప్రస్తుత ఖరీఫ్‌కు 51.8 శాతం లోటువర్షపాతం ముప్పుగా మారింది. జూలై 24 నాటికి ఖరీఫ్‌ నాట్లు గతేడాదితో పోలిస్తే 4.7 శాతం తగ్గాయి.

  • ఏప్రిల్‌-జూన్‌ కాలంలో మాంసం 9.6ు, గుడ్లు 5.1ు, పౌల్ర్టీ మాంసం 4.9ు, పాలు 4.7 శాతం వృద్ధి నమోదుచేశాయి. జూలై నెలలో సముద్ర రొయ్యల్లో 17 శాతం, మంచినీటి రొయ్యల ఉత్పత్తిలో 11.7 శాతం వృద్ధి నమోదైంది.

డిపాజిట్లలో 76 శాతం వృద్ధి

  • మొత్తం రుణాల వృద్ధి రూ. 11,534 కోట్ల నుంచి 168.7 శాతం పెరుగుదలతో రూ. 30,993 కోట్లకు చేరింది. జాతీయ సగటు బ్యాంకు రుణ వృద్ధి 17.7 శాతం, ఎన్‌బీఎ్‌ఫసీ రుణ వృద్ధి -16.6 శాతంతో పోలిస్తే చాలా ఎక్కువ.

  • మొత్తం డిపాజిట్లు రూ. 7,661 కోట్ల నుంచి రూ. 13,492 కోట్లకు పెరిగాయి. దీనిలో 76 శాతానికి పైగా వృద్ధి నమోదైంది.

  • ఎంఎ్‌సఎంఈ రంగానికి ఇచ్చే రుణాల వాటా 39 శాతం నుంచి 41 శాతానికి పెరిగాయి. పొదుపు సంఘాల రుణాలు 5.44 శాతం వృద్ధి చెందాయి.

  • రుణాలు-డిపాజిట్ల నిష్పత్తి 1.51 శాతం నుంచి 2.3 శాతానికి గణనీయంగా పెరిగాయి.

  • జూలైలో ఏపీ పన్ను ఆదాయం 13ు, పన్నేతర ఆదాయం 52.8ు వృద్ధి సాధించాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలు నిరంతరాయంగా సాగడంతో రెవెన్యూ వ్యయం 26.7ు పెరిగింది.

  • మూలధన వ్యయం గత ఏడాదితో పోలిస్తే 23 శాతం తగ్గి రూ. 2,269 కోట్లకు పరిమితమైంది.

  • ఏప్రిల్‌-జూలై కాలంలో రూ.2,88,600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. దాదాపు 75 శాతానికి పైగా వృద్ధి నమోదైంది.

  • జూలైలో ఎంఎ్‌సఎంఈ రంగంలో రూ. 60,035 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది 73.5ు వృద్ధి.


పారిశ్రామిక పరుగులు..

  • మైనింగ్‌లో 17.9 శాతం, విద్యుత్‌ రంగంలో 22.2 శాతం వృద్ధితో పారిశ్రామిక వృద్ధి 8.2 శాతానికి పెరిగింది. ప్రధాన ఖనిజాల మైనింగ్‌ 32.8 శాతం వృద్ధిసాధించింది. జూన్‌లో ఇనుప ఖనిజం 43.9 శాతం పెరిగింది. ఉత్పాదక రంగంలో కేవలం 1 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది.

  • విద్యుత్‌ వినియోగం 13.7 శాతం ఉండగా, జాతీయ సగటు 8.6 శాతం మాత్రమే. అయితే విద్యుత్‌ ఉత్పత్తి మాత్రం 4.6 శాతం తగ్గింది. ఈ అదనపు డిమాండ్‌ తీర్చడానికి ఇతర రాష్ట్రాల గ్రిడ్ల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి వస్తోంది.

భేషుగ్గా సేవా రంగం

  • ఐటీ, వాణిజ్యం, లాజిస్టిక్స్‌, వాణిజ్య కార్యకలాపాల్లో నిరంతర వృద్ధి ఉంది. ఎస్‌టీపీఐ ఎగుమతులు 32.2ు, కమర్షియల్‌ వాహనాల రిజిస్ర్టేషన్లు 51.6ు, కార్గో పరిమాణం 18.6ు, రేవుల్లో కార్గో 7.7ు పెరిగాయి. మెరుగైన కొనుగోలు శక్తి కారణంగా మొదటి త్రైమాసికంలో ఆల్‌ టైమ్‌ గరిష్ఠానికి చేరాయి. గ్రామాల్లో కమర్షియల్‌ వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదు.

  • జూలై 2026లో నికర జీఎ్‌సటీ వసూళ్లు రూ. 3,268 కోట్లకు చేరాయి. గత ఏడాది కంటే 12 శాతం వృద్ధి నమోదైంది.

  • 2026 మేలో 19 ఉపరంగాల్లో 14 రంగాలు రెండంకెల వృద్ధి సాధించాయి. ఇందులో రిటైల్‌, రియల్‌ ఎస్టేట్‌, వసతి, ఐటీ రంగాలు 10.3 శాతం వృద్ధితో ముందంజలో ఉన్నాయి.

  • విమాన ప్రయాణాలు 8.6 శాతం తగ్గాయి. అయితే దేశీయ పర్యాటకులు 99.6 శాతం, విదేశీ పర్యాటకులు 217 శాతంతో అసాధారణ వృద్ధిని నమోదుచేశాయి.

ఇవి కూడా చదవండి

భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్

నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

Updated Date - Aug 12 , 2026 | 06:26 AM