Share News

ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌తో జెన్-జీ యువత సమావేశం

ABN , Publish Date - Aug 24 , 2026 | 01:04 PM

బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌తో జెన్ జీ యువత సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు రెండు వేల మందికిపైగా హాజరయ్యారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌తో జెన్-జీ యువత సమావేశం

భయంగా ఉన్నప్పటికీ ఏదైనా స్థిరమైన నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేయాలి? విజయాన్ని సాధించాలనే పరుగుపందెంలో చిక్కుకోకుండా ఆశయాలను ఎలా కొనసాగించాలి? తమ ఆలోచనలు తల్లిదండ్రులకు అర్థం కాకపోతే వారికి ఎలా వివరించాలి? డబ్బు, విలాసవంతమైన జీవితం, విజయవంతమైన కెరీర్.. ఇవన్నీ కోరుకుంటూనే ఆధ్యాత్మికంగా ఉండగలమా?


ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో శనివారం సమావేశమైన 2,000 మందికి పైగా జెన్-జీ యువత తమ జీవితాల్లో ఎదుర్కొంటున్న ఎన్నో వాస్తవ సమస్యలను ప్రపంచ ఆధ్యాత్మిక గురువు, యువతరం ‘కూల్ గురు’ అని ప్రేమగా సంబోధించే గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌తో పంచుకున్నారు. గురుదేవ్ ఎంతో సూటిగా, చమత్కారంగా, అదే సమయంలో లోతైన ఆలోచనను రేకెత్తించేలా ఇచ్చిన సమాధానాలు యువత ముఖాల్లో చిరునవ్వులు పూయించి వారిలో స్ఫూర్తి నింపాయి. ఈ కార్యక్రమ వాతావరణం సాధారణ ఆధ్యాత్మిక సమావేశాలకు పూర్తి భిన్నంగా కనిపించింది. పాటలు, కేరింతలు, నవ్వులు, సంగీతం, ఫ్యాషన్‌తో పాటు చైతన్యం, సంబంధాలు, ఆశయాలు, డబ్బు, జీవితంలో తమ స్థానాన్ని కనుగొనడం వంటి ఎన్నో అంశాలపై ప్రశ్నలు వరుసగా వచ్చాయి.


భయం లేకుండా స్థిరమైన నిర్ణయం తీసుకోవటం గురించి మాట్లాడుతూ, గురుదేవ్ కఠినత్వానికి తావివ్వొద్దని జెన్-జీకి సూచించారు. 'మీరు ఒక నిర్ణయంపై నిలబడాలి. అదే సమయంలో మారేందుకు కూడా అనువుగా ఉండాలి. మన తర్కం మన జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. అయితే మన జ్ఞానం ఎప్పుడూ పరిమితమేనని వివరిస్తూ, జ్ఞానం పెరిగే కొద్దీ మన దృక్కోణాలు కూడా మారుతాయి. మనకు తెలిసిన విషయాలపై దృఢంగా నిలబడుతూనే, కొత్త విషయాలను స్వీకరించేందుకు మన మనసును తెరిచి ఉంచడమే సమతుల్యత' అని ఆయన చెప్పారు.

ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేటితరానికి, అంతర్గత ప్రశాంతతను కోల్పోకుండా ఆశయాలను కొనసాగించడం ఎలా? అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం - 'ధ్యానం'


తల్లిదండ్రులు-పిల్లల మధ్య సంబంధం కూడా చర్చలోకి వచ్చింది. తమ ఉద్దేశాలతో పెద్దలను బాధపెట్టకుండా, తాము ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా వారికి ఎలా నచ్చజెప్పాలనే ప్రశ్నకు గురుదేవ్.. పూర్తిగా తమ మాటే నెగ్గాలనే పంతం కంటే, ఇచ్చిపుచ్చుకోవడం మంచిదని సూచించారు. 'కొన్నిసార్లు వాళ్ల మాట నెగ్గనీయండి, కొన్నిసార్లు మీది కూడా' అని ఆయన అన్నారు. 'అదే మీ బలం' అని ఆయన చమత్కరించారు.

ప్రేమ, సంబంధాలపై ప్రశ్నల విషయానికి వస్తే.. గురుదేవ్ ఒక సరళమైన ప్రశ్నతో సంభాషణను మరో దిశకు మళ్లించారు. 'సైకిల్ తొక్కడం మీకు తెలుసా?' పాత ఆలోచనా విధానాలపట్ల అతిగా ఆలోచించడం మానేసి, జీవితాన్ని మనదైన రీతిలో ఎలా నడిపించాలో నేర్చుకోవాలన్నదే ఆయన సందేశం. 'మీరు మీరుగా ఉండండి' అని ఆయన సూచించారు.

WhatsApp Image 2026-08-24 at 12.51.30 PM.jpeg


ఆధ్యాత్మికతకు, విజయానికి మధ్య ఏదైనా విరోధం ఉందా? అనే ప్రశ్నకు 'అసలు లేదు' అని సమాధానమిచ్చారాయన. ఆధ్యాత్మికత మనలో స్థైర్యాన్ని, అంతర్‌దృష్టిని, వైఫల్యాల నుంచి తిరిగి కోలుకునే సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వృత్తిపరమైన విజయాన్ని మరింత బలోపేతం చేయగలదని ఆయన చెప్పారు. అంతేకాకుండా అది మన ఆశయాలకు నైతికమైన మార్గదర్శకత్వాన్ని, దిశను కూడా అందిస్తుంది. 'ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని మీరు కోరుకోరు కదా? మరి మీరు ఇతరులను ఎందుకు మోసం చేయాలి?' అని ఆయన అన్నారు.

తమకు ఇష్టమైన రంగంలో కొనసాగడమా, లేక ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని ఎంచుకోవడమా? అనే జెన్ జీ తరానికి సంబంధించిన ప్రశ్నకు ఆయన సమాధానం ఎంతో ఆచరణాత్మకంగా ఉంది. 'మీ అభిరుచిని ఎవరూ మీ నుంచి తీసుకోలేరు. కానీ ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం లభించడం కూడా కష్టమే. కాబట్టి ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని తీసుకుని, మీ అభిరుచిని కూడా కొనసాగిస్తూ, మీరు చేయాలనుకున్నది చేయండి' అని వివరించారు.


ఆ తర్వాత సంభాషణలు క్రమంగా వేడుకగా మారాయి. ఒక ఫ్యాషన్ షో క్యాంపస్‌లో రంగులు, సృజనాత్మకత, జెన్ జీ యువత ఉత్సాహాన్ని నింపింది. అనంతరం నిర్వాణ స్టేషన్‌తో ‘భజన్ క్లబ్బింగ్’ కార్యక్రమం జరిగింది. ఇందులో భక్తి సంగీతం ఆధునిక బీట్‌లతో కలిసిపోయింది. యువత కలిసి పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.

ఇది పరస్పర విరుద్ధంగా కనిపించే ప్రపంచాలు ఎంతో సహజంగా కలిసిన రోజు - ఆధ్యాత్మికత, పాప్ కల్చర్, ఆశయాలు, అంతర్గత ప్రశాంతత, ప్రశ్నలు, వేడుకలు కలగలిసిన ఇంద్రధనుస్సు


ఇవీ చదవండి:

సీఎం విజయ్ సంచలన ప్రకటన.. పొంగల్ నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు

ఇస్రోను మోదీ సర్కార్ బలహీనపరుస్తోంది.. జైరామ్ రమేష్ సంచలన ఆరోపణలు

Updated Date - Aug 24 , 2026 | 01:10 PM