దేశంలోనే అరుదైన భైరవ మంత్రపీఠం
ABN , Publish Date - Feb 13 , 2026 | 09:21 AM
దుబ్బాక విఠలేశ్వరాలయంలో శివలింగ పీఠంపై కాళికాదేవీ సమేతంగా ఆసీనుడైన యోగభైరవుని శిల్పం గుర్తించారు. ఇది పాశుపత శైవంలో కీలకమైన కాలాముఖ సంప్రదాయానికి చెందినదిగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్ధారించింది.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వెలుగులోకి..
దుబ్బాక(సిద్దిపేట): దుబ్బాక విఠలేశ్వరాలయంలో శివలింగ పీఠంపై కాళికాదేవీ సమేతంగా ఆసీనుడైన యోగభైరవుని శిల్పం గుర్తించారు. ఇది పాశుపత శైవంలో కీలకమైన కాలాముఖ సంప్రదాయానికి చెందినదిగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్ధారించింది. ప్రస్తుతం విఠలేశ్వరాలయంగా పిలుస్తున్న శైవక్షేత్రంలో శివలింగ పీఠంపై కాళికాదేవి సమేతంగా ఆసీనుడైన యోగభైరవుని అరుదైన శిల్పాన్ని గుర్తించారు.
ప్రతిమలక్షణాల ఆధారంగా నిపుణులు దీనిని భైరవ మంత్రపీఠంగా నిర్ధారించడంతో దుబ్బాక(Dubbaka) తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. దేశవ్యాప్తంగా ఇటువంటి భైరవ మంత్రపీఠాల ప్రస్తావన లేకపోవడం గుర్తింపు సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
632 మంది మీసేవా ఆపరేటర్లపై వేటు
నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు
Read Latest Telangana News and National News