శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ పీఠిక
ABN , Publish Date - Mar 15 , 2026 | 08:49 AM
శ్రీ పరాభవ నామ సంవత్సర పుష్య శుద్ధ సప్తమి గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రం అనగా 14-1-2027 రాత్రి 8.59 గంటలకు మకర రాశిలో రవి సంక్రమణం జరుగుతుంది.
శ్రీ మహాగణపతయే నమః మకర సంక్రమణం
శ్రీ పరాభవ నామ సంవత్సర పుష్య శుద్ధ సప్తమి గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రం అనగా 14-1-2027 రాత్రి 8.59 గంటలకు మకర రాశిలో రవి సంక్రమణం జరుగుతుంది. సంక్రాంతి పురుషుని నామం మందాకిని. కావున నేతలకు మేలు కలుగుతుంది. సంక్రాంతి పురుషుడు గురువారం వేపాకు స్నానం వల్ల రోగభయాలు అధికంగా ఉంటాయి. యవాక్షతలు ధరించడం వల్ల తోక ధాన్యముల పంటలు నశిస్తాయి. జపాపుష్ప ధారణం వల్ల యుద్ధ భయం కలుగుతుంది. నీలాంబర వస్త్రధారణ వల్ల సజ్జనులకు కష్టనష్టాలు కలుగుతాయి. లాక్ష గంధ ధారణం వల్ల రాక్షస నారీ నాశనం కలుగుతుంది. సంక్రాంతి పురుషుడు గోమేధికం ధరించడం వల్ల మహా భయం కలుగుతుంది. సీస పాత్రలో భోజనం చేయడం వల్ల యుద్ధ దాయకం.
క్షీరాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల కీర్తికి భంగం కలుగుతుంది. రేగుపండును తీసుకోవడం వల్ల చోరుల క్షయం కలుగుతుంది. కోదండాన్ని ఆయుధంగా ఉపయోగించడం వల్ల క్షత్రియులకు కష్టాలు ఎదురవుతాయి. కాంచన ఛత్రాన్ని ధరించడం వల్ల రోగనాశనకరము. సంక్రాంతి పురుషుడు ఏనుగు వాహనాన్ని అధిరోహించడం వల్ల రాజులకు యుద్ధ భయం కలుగుతుంది. విస్మయ ముఖ చేష్టలో ఉండటం వల్ల అశుభదాయకం. ఆగ్నేయముఖ గమనం వల్ల ఆగ్నేయ రాష్ట్రాల్లో క్షామం ఏర్పడుతుంది. శుక్ల పక్షంలో సంక్రమణం జరగడం వల్ల హాహాకారాలు, దుర్భిక్షం, క్షామం కలుగుతుంది. సప్తమి తిథిలో సంక్రమణం జరిగిన ఫలితంగా రోగనాశనం జరుగుతుంది. గురువారం ఫలితంగా సుభిక్షము, క్షేమం, ఆరోగ్యం, సువృష్టి, సస్య సమృద్ధి కలుగుతుంది. సింహలగ్నం కావున జలప్రళయం, వనభంగము సంభవం. బల్లెము ధరించడం వల్ల ప్రజాక్షోభ కలుగుతుంది.
ఉగాది: మార్చి 19, 2026 గురువారం ఉత్తరాభాద్ర నక్షత్రంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఆ రోజున ఉగాది పర్వదినం. ఉగాది నాడు షడ్రుచులతో కూడిన ప్రసాదాన్ని స్వీకరించి, పంచాంగ శ్రవణం చేయడం శుభప్రదం. 2026 మార్చి 22న 1948 శాలివాహన శక సంవత్సరం ప్రారంభం అవుతుంది.
వాస్తు కర్తరి: శ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ బహుళ తదియ అనగా 4-5-2026 సోమవారం రాత్రి 9.45 గంటలకు కర్తరి ప్రారంభం. అధిక జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి 28-5-2026 గురువారం రాత్రి 2.38 గంటలకు వాస్తు కర్తరి ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో గృహారంభం, గృహప్రవేశం, బావులు తవ్వటం, బోర్లు వేయడం, ఇళ్ళు కూల్చడం వంటి పనులు చేయరాదు.
మౌఢ్యాలు: గురు మౌఢ్యమి : శ్రీ పరాభవ నామ సంవత్సర ఆషాఢ శుద్ధ పాడ్యమి పుష్యమి నక్షత్రం అనగా 15-7-2026 బుధవారం నుంచి ఆషాఢ బహుళ నవమి కృత్తిక నక్షత్రం అనగా 7-8-2026 శుక్రవారం వరకు గురు మౌఢ్యమి.
శుక్ర మౌఢ్యమి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ తదియ విశాఖ నక్షత్రం అనగా 13-10-2026 మంగళవారం నుంచి ఆశ్వయుజ బహుళ తదియ కృత్తిక నక్షత్రం అనగా 28-10-2026 బుధవారం వరకు శుక్ర మౌఢ్యమి. ఈ గురు, శుక్ర మౌఢ్యాల కాలంలో వివాహ, ఉపనయన, గృహారంభ, గృహప్రవేశాది శుభకార్యాలు చేయరాదు.
గ్రహణాలు: ఈ ఏడాది ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం, ఆగస్టు 28న పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడతాయి. అయితే ఇవి భారతదేశంలో కనిపించవు.
యమున నది పుష్కరం : శ్రీ పరాభవ నామ సంవత్సర అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి జ్యేష్ఠ నక్షత్రం సోమవారం 1-6-2026 రాత్రి 1.49 గంటలకు గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశి ప్రవేశం జరుగుతుంది. కావున ఈ సంవత్సరం యమునానదికి పుష్కరం వస్తుంది. ఆ రోజు నుంచి 12 రోజుల పాటు నదీ స్నానాలు, దానధర్మాలు, పితృకార్యాలు చేయటం పుణ్యప్రదం.
శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలం
శ్లో: పార్థివై ర్మండలీకైశ్చ సామం తై ర్దండనాయకైః
పీడ్యం తేవై ప్రజాః సర్వాః క్షుదార్తాశ్చ పరాభవే
పరాభవాబ్దే రాజనః ప్రాప్నువంతి పరాభవం
అమయః క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్ఠయః
తా: రాజులు, సామంతులు, దండనాయకులు, న్యాయాధికారులు ప్రజలను నానావిధములుగా పీడిస్తారు. ఆకలి బాధలు పెరుగుతాయి. రాజులు పరస్పరం కలహించుకుని నవ్వులపాలు అవుతారు. అపర ధాన్యాలు బాగా పండుతాయి. పరాభవ సంవత్సరాధిపతి కేతువు అయిన ఫలితంగా వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. చైత్ర, వైశాఖ మాసాలలో ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. మేఘాడంబరము, ఉరుములు, మెరుపులు ఉంటాయి. వడగాడ్పులు అధికంగా ఉంటాయి. జ్యేష్ఠమాసంలో వడగాడ్పులు మరింత పెరుగుతాయి. అగ్నిభయం కలుగుతుంది. ఆషాఢ మాసంలో అల్పవృష్టి. ఆహారధాన్యాల ధరలు పెరుగుతాయి. శ్రావణ మాసంలో వర్షాలు అధికంగా కురుస్తాయి. ఈ మాసంలో ఖండవృష్ఠి. దుర్భిక్షము కలుగుతుంది. ఆశ్వయుజమాసంలో ధాన్యములు, ధాతువస్తువులు, రసవస్తువుల ధరలు పెరుగుతాయి. కార్తీకమాస పంచకములో ధరలు సరసంగా ఉంటాయి. పశ్చిమదేశాలలో ఆహారధాన్యాల ధరలు సరసంగా ఉంటాయి. సింధు, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పంటలు బాగా పండుతాయి
నవనాయక ఫలం
రాజు - గురువు: గురువుకు రాజ్యాధిపత్యం లభించడం వల్ల ద్విజులు సత్కర్మ నిరతులై ఉంటారు. రాజులు, ప్రజలు న్యాయబద్ధంగా ఉంటారు. రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారు. సస్యానుకూల వర్షాలు కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. ఉప్పు, గంధక ద్రవ్యాలు, తగరం, రబ్బరు, శనగలు, వేరుశనగ, పంచదార, బెల్లం, చెరకు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, తేనె, కల్లు, షేర్లు, బ్యాంకు డిపాజిట్లు, ప్రత్తి, చర్మము, కుసుమ ధాన్యాలు, గరుడ పచ్చ రాళ్లు, నూలు, వస్త్రములు, ఉలవలు, అపర ధాన్యాలు, కోకో, రేకులు, సిమెంటు, వెండి, బంగారం, ధాన్యం, బియ్యం ధరలు సరసంగా ఉంటాయి. రాజు వాహనం నౌక కావున ప్రజా కల్లోలం జరుగుతుంది. ప్రజలు ఆకలి బాధలతో అలమటిస్తారు.
మంత్రి - కుజుడు: కుజుడికి మంత్రి పదవి లభించడంతో కలహములు, యుద్ధములు, చోర రోగాగ్ని భయాలు, వాయుపీడ అధికంగా ఉంటాయి. వర్షం మధ్యమంగా కురుస్తుంది. పంటలకు తెగుళ్లు సోకుతాయి. ఫలితంగా ధాన్యాదుల ధరలు తగ్గుతాయి. ధాతు లోహముల ధరలు సరసంగా ఉంటాయి.
సేనాధిపతి - చంద్రుడు: చంద్రుడికి సేనాధిపత్యం లభించినందువల్ల ఆహారధాన్యాలు, వెండి, బంగారం, పెట్రోలు, కిరోసిన్, వెన్న, నెయ్యి, పంచదార, నూలు, వస్త్రములు, బియ్యం ధరలు పెరుగుతాయి. మంచి వర్షాలు కురుస్తాయి కాబట్టి పంటలు బాగా పండుతాయి. ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తారు. పశువులు సమృద్ధిగా పాలు ఇస్తాయి.
సస్యాధిపతి - గురువు: బృహస్పతికి సస్యాధిపత్యం లభించినందున పచ్చని భూములు, పచ్చని ధాన్యాదులు బాగా పండుతాయి. యవలు, గోధుమలు, శనగలు, పచ్చజొన్నలు, పెసలు, ఉలవలు బాగా పండుతాయి. ప్రత్తి, చర్మము, వెండి, బంగారము, వేరుశనగలు, తగరం, రబ్బరు, బ్యాంకు వ్యాపార వాటాలు బాగా పెరుగుతాయి. వస్త్రములు ధరలు తగ్గుతాయి.
ధాన్యాధిపతి - బుధుడు: బుధుడికి ధాన్యాధిపత్యం లభించినందున వర్షపాతం మధ్యమంగా ఉం టుంది. పంటలు మధ్యమంగా పండుతాయి. గాలి కారణంగా మబ్బులు తేలిపోతాయి. ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయి. తుఫాను గాలి వల్ల నష్టం కలుగుతుంది.
అర్ఘాధిపతి - చంద్రుడు: చంద్రుడికి అర్ఘాధిపత్యం లభించినందున వర్షాలు బాగా కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. తేనె, రసవస్తువులు, ఉప్పు, మణులు, శంఖములు, ముత్యములు, చేపలు, గోధుమలు, ఆహార ధాన్యాలు, వస్త్రములు, జొన్నలు, సజ్జలు, పంచదార, బెల్లం, కిరోసిన్, పెట్రోలు ధరలు కాకుండా మిగిలిన నూనెల ధరలు, నెయ్యి, వెన్న, పెరుగు, పాలు, తమలపాకులు, బియ్యం, మజ్జిగ, సన్నని వస్త్రాలు, వెండి, బంగారం ధరలు అధికంగా ఉంటాయి.
రసాధిపతి - శని: శనికి రసాధిపత్యం లభించడం వల్ల నవ్వులు, మినుములు, ఉలవల ధరలు పెరుగుతాయి. నల్లని భూముల్లో నల్ల ధాన్యాలు పండుతాయి. నీలిమందు, ఉన్ని, పట్టు, వెండి, బంగారం, కంచు, పట్టువస్త్రములు, ధావళీలు, శాలువాలు మొదలగు వస్తువుల ధరలు సరసముగా ఉంటాయి. రసవస్తువుల ధరలు తగ్గుతాయి. వర్షాలు స్వల్పంగా ఉంటాయి.
నీరసాధిపతి - గురువు: గురువుకు నీరసాధిపత్యం లభించడంంతో వక్కలు, సమస్త మణులు, రత్నాలు, బంగారం, వెండి, ధాన్యములు, పత్తి, చర్మములు, పూలు, సుగంధద్రవ్యాలు, చందనము మొదలైన వాటి ధరలు హెచ్చుగా ఉంటాయి. సజ్జనులు గౌరవం పొందుతారు.
వర్షప్రమాణం : రాజు గురువు కావడంతో ఈ ఏడాది నాలుగు తూముల వర్షాలు కురుస్తాయి. ద్రోణము అనగా నాలుగు తూములు. ‘ద్రోణే వృష్ఠిర్హి మధ్యమా’ అని శాస్త్ర వచనం కాబట్టి వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. ఆఢకము దేవమానముచే 80 యోజనముల నిడివి, నూరు యోజనముల ఎత్తు కలిగి ఉంటుంది. వర్షాలు సముద్రము నందు 7 భాగాలు, పర్వతములందు 9 భాగాలు, భూమి యందు నాలుగు భాగాలు కురుస్తాయి.
ఆఢకదారుని ఫలం : ఈ ఏడాది మీన రాశిలో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా ఆఢకం విప్ర హస్తగతమై ఉంటుంది. ఫలితంగా దుర్భిక్షం, భయోత్పాతాలు, ప్రజాక్షోభ, ఆహారధాన్యాల కొరత ఏర్పడుతుంది. కాబట్టి ధాన్యాదుల ధరలు ఎక్కువగా ఉంటాయి.
ఆర్ద్ర నక్షత్ర ఫలం: శ్రీ పరాభవ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ అష్టమి సోమవారం అనగా 22-6-2026 మధ్యాహ్నం 12.33 గంటలకు ఉత్తర నక్షత్రం, బవ కరణం, వ్యతీపాత యోగం, కన్యా లగ్నంలో రవి ఆర్ర్దా నక్షత్రంలో ప్రవేశిస్తాడు. ఫలితంగా సుఖము, సుభిక్షము, మంచి వర్షాలు కురుస్తాయి. స్పల్ప దుఃఖము ఉంటుంది.
మేష సంక్రమణ ఫలం
శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర బహుళ ద్వాదశి, శతభిషా నక్షత్రం మంగళవారం 14-4-2026 ఉదయం 9.08 గంటలకు నిరయన మేషరాశిలోకి రవి ప్రవేశిస్తాడు. ఆ సమయానికి వృషభ లగ్నం అయింది. లగ్నాధిపతి శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. అష్టమాధిపతి అయిన గురువుతో, దశమంలో ఉన్న చంద్రుడితో శుభదృష్టిని పొంది ఉన్నాడు. లగ్నంలో యురేనస్ గ్రహం ఉన్నది. రవి, దశమ స్థానాల మధ్య 60 డిగ్రీల శుభదృష్టి ఉంది. ఈ గ్రహస్థితి ఫలితంగా కమ్యూనికేషన్‌లు, టెక్నాలజీ రంగంలో భారతదేశం పురోభివృద్ధి సాధి స్తుంది. రవి - దశమస్థానం మధ్య శుభదృష్టి ఏర్పడిన కారణంగా ప్రభుత్వం చక్కటి పరిపాలన అందిస్తుంది. విదేశీ వ్యవహారాల్లో భారతదేశ గౌరవప్రతిష్ఠలు పెంపొందుతాయి. బ్యాంకింగ్, స్టాక్‌మార్కెట్, అంతర్జాతీయ వ్యాపార రంగాల్లో ప్రభుత్వం కొత్త సంస్కరణలు చేపట్టి విజయం సాధిస్తుంది.
గురు - శుక్రుల మధ్య 60 డిగ్రీల శుభ దృష్టి ఏర్పడిన ఫలితంగా ఆర్థిక రంగంలో దేశం పురోగతి సాధిస్తుంది. ద్వితీయాధిపతి బుధుడు లాభంలో ఉండి యురేన్‌సతో శుభదృష్టిని పొంది ఉన్నాడు. శని, కుజులతో కలిసి ఉన్నాడు. ఫలితంగా ప్రభుత్వం ఆర్థిక రంగంలో, రక్షణ రంగంలో స్వావలంబనపై దృష్టి కేంద్రీకరిస్తుంది. దశమాధిపతి శని, బుధుడితో కలిసి ఉన్న ఫలితంగా ఆర్థిక రంగ వికాసం, వాణిజ్య నైపుణ్యం ఫలితంగా అంతర్జాతీయంగా భారతదేశ గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. లగ్నాధిపతి శుక్రుడు వ్యయంలో ఉండి గురువుతో శుభదృష్టి పొందిన ఫలితంగా పొరుగు దేశాలతో పాటు అగ్రదేశాలతో చర్చల విషయంలో భారత్ పైచేయి సాధిస్తుంది.
ఆర్థిక రంగం : గురు - శుక్రుల అనుకూల దృష్టి కారణంగా ఈ ఏడాది దేశం ఆర్థిక రంగంలో అద్భుత వికాసం సాఽధిస్తుంది. గురు, బుధుల పరివర్తన ఫలితంగా మన దేశం వాణిజ్య రంగంలో భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. పన్నులు, బ్యాంకింగ్, షేర్‌మార్కెట్, బీమా రంగాల్లో ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు శ్రీకారం చుడుతుంది. ప్రభుత్వం కొత్త పొదుపు పథకాలను ప్రారంభిస్తుంది. షేర్ మార్కెట్ రంగం మంచి లాభాలను అందిస్తుంది. బ్యాంకింగ్, మూచ్యువల్ ఫండ్ రంగాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో భారత్ ప్రత్యర్థి దేశాలను అధిగమించి పైచేయి సాధిస్తుంది.
టెక్నాలజీ రంగం: లగ్నంలో దశమాధిపతి యురేనస్ ఉన్న ఫలితంగా టెక్నాలజీ, సైన్స్, ఏరోస్పేస్ రంగాల్లో భారతదేశం మంచి పురోగతి సాఽధిస్తుంది. పట్టుదలతో స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని స్వావలంబన దిశగా దేశం ముందడుగు వేస్తుంది. టెక్నాలజీ, ఏరోస్సేస్ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. యురేన్‌సకు దశమ స్థానంలో 90 డిగ్రీల ప్రతికూల దృష్టి ఉన్న ఫలితంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం రావడంతో టెక్నాలజీ రంగంలో ఉన్నవారు నైపుణ్యాలను మెరుగుపరచుకుంటే తప్ప ఉద్యోగాలను నిలుపుకోలేని పరిస్థితి ఎదురవుతుంది.
ఉపాధి రంగం: దశమంలో చంద్రుడు ఉన్నాడు. ఫలితంగా ఉపాధి అవకాశాలు పెంపొందుతాయి. తృతీయాధిపతి చంద్రుడు, అష్టమ, లాభాధిపతి గురువు మధ్య శుభదృష్టి ఉన్న ఫలితంగా కమ్యూనికేషన్లు, మార్కెటింగ్, సేవలు, వైద్యం, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందుతాయి. షష్ఠమాధిపతి శుక్రుడికి గురువుతో శుభదృష్టి ఉన్నా, శత్రుక్షేత్రంలో, వ్యయస్థానంలో ఉన్న ఫలితంగా ఉపాధి రంగంలో ఆశించిన మేరకు అవకాశాలు లభించకపోవచ్చు. వ్యవసాయం, పరిశ్రమలు, మాన్యుఫాక్చరింగ్ రంగాలు మందగిస్తాయి.
శుభముహూర్తాలు
ఏప్రిల్ - 2026
15 బుధ చైత్ర బ. త్రయోదశి ఉత్తరాభాద్ర వృశ్చిక రా.9:09 వ్యా, గృ.ప్ర.
23 గురు వైశాఖ శు. సప్తమి పునర్వసు వృషభ ఉ. 8:00 వివా, వ్యా,
23 గురు వైశాఖ శు. సప్తమి పునర్వసు కర్కాటక ఉ. 11:58 వివా,
23 గురు వైశాఖ శు. సప్తమి పునర్వసు వృశ్చిక రా. 8:37 వ్యా,
26 ఆది వైశాఖ శు.దశమి మఖ కర్కాటక ఉ.11:46 వివా, గృ.ప్ర.
26 ఆది వైశాఖ శు. ఏకాదశి మఖ వృశ్చిక రా.8:25 వ్యా, గృ.ప్ర.
29 బుధ వైశాఖ శు. త్రయోదశి హస్త కర్కాటక ఉ.11:34 వివా.
మే
1 శుక్ర వైశాఖ శు.పౌర్ణమి స్వాతి కర్కాటక ఉ.11:26 వివా, గృ.ఆ,.
1 శుక్ర వైశాఖ బ. పాడ్యమి స్వాతి మకర రా.12:55 వివా, (ద్వి)
3 ఆది వైశాఖ బ. విదియ అనూరాధ వృశ్చిక రా.7:58 వ్యా, గృ.ప్ర.
3 ఆది వైశాఖ బ. విదియ అనూరాధ మకర రా.12:47 వివా,
4 సోమ వైశాఖ బ. తదియ అనూరాధ వృషభ ఉ.7:17 వ్యా,
6 బుధ వైశాఖ బ. పంచమి మూల కర్కాటక ఉ.11:07 వివా, (ద్వి)
8 శుక్ర వైశాఖ బ. సప్తమి ఉత్తరాషాఢ వృశ్చిక రా.7:38 వ్యా,
8 శుక్ర వైశాఖ బ. సప్తమి శ్రవణం మకర రా.12:28 వివా, (ద్వి)
9 శని వైశాఖ బ. సప్తమి శ్రవణం మిథున ఉ.9:55 వివా, ఉప, వ్యా,.
11 సోమ వైశాఖ బ.దశమి శతభిష వృశ్చిక రా.7:26 వ్యా,
11 సోమ వైశాఖ బ.దశమి శతభిషం మకర రా.12:16 వివా,
13 బుధ వైశాఖ బ. ఏకాదశి ఉత్తరాభాద్ర వృషభ ఉ.6:42 వివా, (ద్వి)
13 బుధ వైశాఖ బ. ఏకాదశి ఉత్తరాభాద్ర మిథున ఉ.9:39 వివా, ఉప, వ్యా,.
14 గురు వైశాఖ బ. త్రయోదశి రేవతి వృశ్చిక రా.7:15 వివా, వ్యా,.
25 సోమ అధిక జ్యేష్ఠ శు.దశమి ఉత్తర మిథున ఉ.8:52 వ్యా,
25 సోమ అధిక జ్యేష్ఠ శు.దశమి ఉత్తర ధనస్సు రా.9:52 వ్యా, (ద్వి)
27 బుధ అధిక జ్యేష్ఠ శు. ద్వాదశి చిత్త మిథున ఉ.8:44 వ్యా, (ద్వి)
27 బుధ అధిక జ్యేష్ఠ శు. ద్వాదశి చిత్త ధనస్సు రా.9:44 వ్యా,
28 గురు అధిక జ్యేష్ఠ శు. త్రయోదశి స్వాతి మిథున ఉ.8:40 వ్యా,
28 గురు అధిక జ్యేష్ఠ శు. త్రయోదశి స్వాతి ధనస్సు రా.9:40 వ్యా,
31 ఆది అధిక జ్యేష్ఠ శు.పౌర్ణమి అనూరాధ మిథున ఉ.8:28 వ్యా,
జూన్
1 సోమ అధిక జ్యేష్ఠ బ. విదియ మూల ధనస్సు రా.9:24 వ్యా,
5 శుక్ర అధిక జ్యేష్ఠ బ. పంచమి శ్రవణం ధనస్సు రా.9:08 వ్యా,
7 ఆది అధిక జ్యేష్ఠ బ. సప్తమి శతభిష మిథున ఉ.8:01 వ్యా,
10 బుధ అధిక జ్యేష్ఠ బ.దశమి ఉత్తరాభాద్ర మిథున ఉ.7:49 వ్యా, (ద్వి)
11 గురు అధిక జ్యేష్ఠ బ. ఏకాదశి రేవతి మిథున ఉ.7:45 వ్యా,
11 గురు అధిక జ్యేష్ఠ బ. ఏకాదశి అశ్విని ధనస్సు రా.8:45 వ్యా,
17 బుధ జ్యేష్ఠ శు. తదియ పునర్వసు కర్కాటక ఉ.8:21 వివా,
24 బుధ జ్యేష్ఠ శు. దశమి చిత్త కర్కాటక ఉ.7:54 వివా, అన్న, గృ.ఆ, గృ.ప్ర.
26 శుక్ర జ్యేష్ఠ శు. ద్వాదశి అనూరాధ మకర రా.9:15 గృ.ప్ర.
27 శని జ్యేష్ఠ శు. త్రయోదశి అనూరాధ కర్కాటక ఉ.7:42 వివా, అన్న, గృ.ఆ, గృ.ప్ర.
29 సోమ జ్యేష్ఠ శు.పౌర్ణమి మూల కర్కాటక ఉ.7:34 వివా, అన్న, గృ.ఆ, గృ.ప్ర.
జూలై
1 బుధ జ్యేష్ఠ బ. విదియ ఉత్తరాషాఢ మేష రా.2:02 వివా,
1 బుధ జ్యేష్ఠ బ. పాడ్యమి ఉత్తరాషాఢ కర్కాటక ఉ.7:26 వివా, అన్న, గృ.ఆ, గృ.ప్ర.
1 బుధ జ్యేష్ఠ బ. విదియ ఉత్తరాషాఢ మకర రా.8:55 గృ.ప్ర.
2 గురు జ్యేష్ఠ బ. విదియ ఉత్తరాషాఢ కర్కాటక ఉ.7:22 అన్న, గృ.ఆ, గృ.ప్ర(ద్వి)
3 శుక్ర జ్యేష్ఠ బ. తదియ శ్రవణం కర్కాటక ఉ.7:18 అన్న, గృ.ఆ,.
4 శని జ్యేష్ఠ బ. పంచమి శతభిష మేష రా.1:50 వివా,
5 ఆది జ్యేష్ఠ బ. పంచమి శతభిష కర్కాటక ఉ.7:10 వివా, అన్న, గృ.ఆ, గృ.ప్ర (ద్వి)
6 సోమ జ్యేష్ఠ బ. సప్తమి ఉత్తరాభాద్ర మకర రా.8:35 గృ.ప్ర. (ద్వి)
ఆగస్టు
16 ఆది శ్రావణ శు. పంచమి హస్త వృషభ రా.12:28 వివా,
22 శని శ్రావణ శు. ఏకాదశి మూల కర్కాటక తె.4:02 వివా,
27 గురు శ్రావణ శు.పౌర్ణమి ధనిష్ఠ వృషభ రా.11:45 వివా,
27 గురు శ్రావణ శు.పౌర్ణమి శతభిష కర్కాటక తె.3:42 వివా (ద్వి)
28 శుక్ర శ్రావణ బ. పాడ్యమి శతభిషం వృషభ రా.11:41 వివా,
30 ఆది శ్రావణ బ. తదియ ఉత్తరాభాద్ర కర్కాటక తె.3:31 వివా (ద్వి)
30 ఆది శ్రావణ బ. తదియ ఉత్తరాభాద్ర తుల ఉ.11:11 వివా, ఉప, వ్యా, గృ.ఆ, గృ.ప్ర.
సెప్టెంబర్
6 ఆది శ్రావణ బ. ఏకాదశి పునర్వసు కర్కాటక తె.3:03 వివా (ద్వి)
7 సోమ శ్రావణ బ. ఏకాదశి పునర్వసు తుల ఉ.10:40 ఉప, వ్యా, (ద్వి)
13 ఆది భాద్రపద శు. తదియ హస్త తుల ఉ.10:16 వ్యా(ద్వి)
21 సోమ భాద్రపద శు.దశమి ఉత్తరాషాఢ తుల ఉ.9:44 వ్యా(ద్వి)
21 సోమ భాద్రపద శు.దశమి ఉత్తరాషాఢ వృశ్చిక ఉ.10:44 వ్యా.
24 గురు భాద్రపద శు. త్రయోదశి ధనిష్ఠ తుల ఉ.9:29 వ్యా.
27 ఆది భాద్రపద బ.పాడ్యమి రేవతి మేష రా.8:12 వ్యా.
27 ఆది భాద్రపద బ. పాడ్యమి ఉత్తరాభాద్ర తుల ఉ.9:17 వ్యా.
27 ఆది భాద్రపద బ. పాడ్యమి ఉత్తరాభాద్ర వృశ్చిక ఉ.10:16 వ్యా.(ద్వి)
28 సోమ భాద్రపద బ. తదియ అశ్విని మేష రా.8:08 వ్యా.(ద్వి)
28 సోమ భాద్రపద బ. తదియ అశ్విని వృషభ రా.9:35 వ్యా.
అక్టోబర్
1 గురు భాద్రపద బ. పంచమి రోహిణి తుల ఉ.9:01 వ్యా.
2 శుక్ర భాద్రపద బ. సప్తమి మృగశిర మేష రా.7:53 వ్యా.
5 సోమ భాద్రపద బ. దశమి పుష్యమి మేష రా.7:41 వ్యా,
11 ఆది ఆశ్వయుజ శు. విదియ స్వాతి మిథున రా.11:41 వివా.
12 సోమ ఆశ్వయుజ శు. విదియ స్వాతి వృషభ రా.8:40 వ్యా.
12 సోమ ఆశ్వయుజ శు. తదియ స్వాతి మిథున రా.11:37 వివా.
12 సోమ ఆశ్వయుజ శు. విదియ స్వాతి వృశ్చిక ఉ.9:17 వివా, వ్యా, గృ.ఆ.
30 శుక్ర ఆశ్వయుజ బ. పంచమి మృగశిర వృశ్చిక ఉ.8:06 వివా, వ్యా, గృ.ఆ, గృ.ప్ర.
31 శని ఆశ్వయుజ బ. సప్తమి పునర్వసు మిథున రా.10:23 వివా.
నవంబర్
1 ఆది ఆశ్వయుజ బ. సప్తమి పుష్యమి వృశ్చిక ఉ.7:59 వ్యా.
5 గురు ఆశ్వయుజ బ. ఏకాదశి ఉత్తర వృశ్చిక ఉ.7:43 వివా, వ్యా, గృ.ఆ, గృ.ప్ర(ద్వి)
6 శుక్ర ఆశ్వయుజ బ. త్రయోదశి హస్త వృషభ రా.7:02 వివా, వ్యా, (ద్వి)
6 శుక్ర ఆశ్వయుజ బ. త్రయోదశి హస్త మిథున రా.9:59 వివా,
11 బుధ కార్తీక శు. విదియ అనూరాధ వృశ్చిక ఉ.7:19 వివా, వ్యా, గృ.ఆ, గృ.ప్ర(ద్వి)
14 శని కార్తీక శు. పంచమి ఉత్తరాషాఢ మిథున రా.9:28 వ్యా, గృ.ప్ర.
16 సోమ కార్తీక శు. సప్తమి శ్రవణం మిథున రా.9:20 వ్యా,.
16 సోమ కార్తీక శు. సప్తమి శ్రవణం వృశ్చిక ఉ.7:00 వివా, వ్యా, గృ.ఆ.
20 శుక్ర కార్తీక శు. ఏకాదశి ఉత్తరాభాద్ర కర్కాటక రా.10:05 వివా.(ద్వి)
20 శుక్ర కార్తీక శు. ఏకాదశి ఉత్తరాభాద్ర తుల తె.5:45 వివా.
20 శుక్ర కార్తీక శు. ఏకాదశి ఉత్తరాభాద్ర ధనస్సు ఉ.10:04 వివా, వ్యా, గృ.ఆ.
21 శని కార్తీక శు. ద్వాదశి రేవతి కర్కాటక రా.10:01 వివాహం
22 ఆది కార్తీక శు. త్రయోదశి అశ్విని మిథున రా.8:57 వివా. వ్యా.
22 ఆది కార్తీక శు. త్రయోదశి అశ్విని ధనస్సు ఉ.9:57 వివా. వ్యా. గృ.ఆ.(ద్వి)
25 బుధ కార్తీక బ. విదియ మృగశిర కర్కాటక రా.9:45 వివా.
25 బుధ కార్తీక బ. విదియ మృగశిర తుల తె. 5:25 వివా.(ద్వి)
26 గురు కార్తీక బ. విదియ మృగశిర ధనస్సు ఉ.9:41 వ్యా. అన్న, గృ.ఆ.
28 శని కార్తీక బ. పంచమి పునర్వసు ధనస్సు ఉ.9:33 వివా. వ్యా. అన్న.
డిసెంబర్
3 గురు కార్తీక బ. ఏకాదశి హస్త తుల తె.4:54 వివా.(ద్వి)
3 గురు కార్తీక బ.దశమి ఉత్తర ధనస్సు ఉ.9:13 వివా, వ్యా, గృ.ఆ.(ద్వి)
4 శుక్ర కార్తీక బ. ఏకాదశి చిత్త కర్కాటక రా.9:10 వివా, గృ.ప్ర.
5 శని కార్తీక బ. త్రయోదశి స్వాతి తుల తె.4:46 వివా.
6 ఆది కార్తీక బ. త్రయోదశి స్వాతి ధనస్సు ఉ.9:02 వివా, అన్న, గృ.ఆ.
13 ఆది మార్గశిర శు. పంచమి శ్రవణంం మిథున రా.7:34 వివా.(ద్వి)
19 శని మార్గశిర శు. ఏకాదశి అశ్విని వృశ్చిక తె.4:50 వివా.
23 బుధ మార్గశిర శు.పౌర్ణమి మృగశిర తుల తె.3:35 వివా.
24 గురు మార్గశిర బ.పాడ్యమి పునర్వసు వృశ్చిక తె.4:31 వివా.
జనవరి - 2027
1 శుక్ర మార్గశిర బ.దశమి స్వాతి వృశ్చిక తె.3:59 వివా.
24 ఆది పుష్య బ. తదియ మఖ మేష మ.12:25 వ్యా.
ఫిబ్రవరి
7 ఆది మాఘ శు. విదియ శతభిష తుల రా.12:34 వివా.
7 ఆది మాఘ శు. విదియ శతభిష ధనస్సు తె.4:54 వివా.
11 గురు మాఘ శు. పంచమి రేవతి వృశ్చిక రా.1:18 వివా.
20 శని మాఘ శు.పౌర్ణమి మఖ తుల రా.11:43 వివా. (ద్వి)
22 సోమ మాఘ బ. విదియ ఉత్తర వృషభ ఉ.11:58 వివా, వ్యా.(ద్వి)
22 సోమ మాఘ బ. విదియ ఉత్తర తుల రా.11:35 వివా.(ద్వి)
22 సోమ మాఘ బ. తదియ ఉత్తర వృశ్చిక రా.12:35 వివా.(ద్వి)
22 సోమ మాఘ బ. తదియ ఉత్తర ధనస్సు తె.3:55 వివా.
25 గురు మాఘ బ. పంచమి స్వాతి మేష ఉ.10:19 వ్యా, గృ.ఆ.
25 గురు మాఘ బ. పంచమి స్వాతి వృషభ ఉ.11:46 వివా, వ్యా.(ద్వి)
మార్చి
3 బుధ మాఘ బ. ఏకాదశి ఉ.షాఢ తుల రా.11:00 వివా.(ద్వి)
3 బుధ మాఘ బ. ఏకాదశి ఉ.షాఢ ధనస్సు తె.3:20 వివా.(ద్వి)
4 గురు మాఘ బ. ద్వాదశి ఉ.షాఢ తుల రా.10:56 వివా.(ద్వి)
4 గురు మాఘ బ. ద్వాదశి ఉ.షాఢ వృశ్చిక రా.11:55 వివా.
4 గురు మాఘ బ. ద్వాదశి శ్రవణ ధనస్సు తె.3:16 వివా.
5 శుక్ర మాఘ బ. ద్వాదశి శ్రవణ మేష ఉ.9:47 వివా, వ్యా, గృ.ఆ.
5 శుక్ర మాఘ బ. త్రయోదశి శ్రవణ వృషభ ఉ.11:14 వివా, వ్యా.(ద్వి)
5 శుక్ర మాఘ బ. త్రయోదశి శ్రవణ తుల రా.10:52 వివా.
5 శుక్ర మాఘ బ. త్రయోదశి శ్రవణ ధనస్సు తె.3:12 వివా.(ద్వి)
11 గురు ఫాల్గుణ శు. తదియ రేవతి మేష ఉ.9:24 వివా. వ్యా.
15 సోమ ఫాల్గుణ శు. సప్తమి రోహిణి మేష ఉ.9:08 వ్యా.
15 సోమ ఫాల్గుణ శు. సప్తమి మృగశిర వృషభ ఉ.10:35 ఉప, వ్యా, గృ.ఆ, గృ.ప్ర.
17 బుధ ఫాల్గుణ శు.దశమి పునర్వసు వృషభ ఉ.10:27 వివా, ఉప, వ్యా.
17 బుధ ఫాల్గుణ శు.దశమి పునర్వసు కుంభ ఉ.6:03 వివా.
20 శని ఫాల్గుణ శు. త్రయోదశి మఖ వృషభ ఉ.10:15 వివా, ఉప, వ్యా, గృ.ప్ర.
21 ఆది ఫాల్గుణ శు.పౌర్ణమి ఉత్తర వృశ్చిక రా.10:48 వివా.
22 సోమ ఫాల్గుణ శు.పౌర్ణమి ఉత్తర వృషభ ఉ.10:07 ఉప, వ్యా.
24 బుధ ఫాల్గుణ బ. తదియ స్వాతి వృశ్చిక రా.10:36 వివా.
24 బుధ ఫాల్గుణ బ. తదియ స్వాతి కుంభ తె. 5:35 వివా.
26 శుక్ర ఫాల్గుణ బ. పంచమి అనూరాధ తుల రా.9:29 వివా, వ్యా, గృ.ప్ర.
26 శుక్ర ఫాల్గుణ బ. పంచమి అనూరాధ వృశ్చిక రా.10:29 వివా.(ద్వి)
26 శుక్ర ఫాల్గుణ బ. పంచమి అనూరాధ కుంభ తె. 5:27 వివా.
27 శని ఫాల్గుణ బ. పంచమి అనూరాధ మేష ఉ.8:21 వివా, వ్యా.
31 బుధ ఫాల్గుణ బ.దశమి ఉ.షాఢ కుంభ తె. 5:07 వివా.
ఏప్రిల్
1 గురు ఫాల్గుణ బ.దశమి ఉ.షాఢ మేష ఉ.8:01 వివా, వ్యా.
1 గురు ఫాల్గుణ బ.దశమి శ్రవణ వృషభ ఉ.9:28 వివా, ఉప, వ్యా, గృ.ఆ.
1 గురు ఫాల్గుణ బ.దశమి శ్రవణ తుల రా.9:05 వివా, వ్యా.
1 గురు ఫాల్గుణ బ.దశమి శ్రవణ వృశ్చిక రా.10:05 వివా.(ద్వి)
2 శుక్ర ఫాల్గుణ బ. ఏకాదశి దనిష్ఠ వృశ్చిక రా.10:01 వివా.
3 శని ఫాల్గుణ బ. ద్వాదశి దనిష్ఠ వృషభ ఉ.9:20 వివా, ఉప, వ్యా, గృ.ఆ, గృ.ప్ర.
3 శని ఫాల్గుణ బ. ద్వాదశి శతభిష తుల రా.8:58 వివా, వ్యా.(ద్వి)
3 శని ఫాల్గుణ బ. త్రయోదశి శతభిష కుంభ తె.4:55 వివా,
4 ఆది ఫాల్గుణ బ. త్రయోదశి శతభిష మేష ఉ.7:49 వివా, వ్యా.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News