సైబర్ ముప్పును ఎదుర్కోవాలంటే
ABN , Publish Date - Mar 15 , 2026 | 05:49 AM
‘మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. సైబర్ ముప్పును ఎదుర్కోక తప్పదు. అందుకు సైబర్ హైజిన్ తప్పనిసరి’ అని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పేర్కొన్నారు.
‘సైబర్ హైజిన్’ తప్పనిసరి.. ఏపీ సీఐడీ సదస్సులో డీజీ అయ్యన్నార్
అమరావతి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ‘మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. సైబర్ ముప్పును ఎదుర్కోక తప్పదు. అందుకు సైబర్ హైజిన్ తప్పనిసరి’ అని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పేర్కొన్నారు. రాష్ట్రలో ని సీఐడీ అధికారులకు వీఐటీ-ఏపీ సహకారంతో ‘సైబర్ హైజిన్-సైబర్ సెక్యూరిటీలో ఉత్తమ పద్ధతులు’ పేరుతో మార్చి 10 నుంచి 14 వరకూ 5 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ ముగింపు సందర్భంగా శనివారం అయ్యన్నార్ మాట్లాడారు. ‘దొంగలు ఇంట్లోకి చొరబడకుండా తాళం వేసిన ట్లు.. ప్రతి ఒక్కరూ మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌కు బలమైన పాస్‌వర్డ్‌లు ఏర్పాటు చేసుకోవాలి. అనుమానాస్పద ఈ-మెయిల్స్ తెరిస్తే ఫిషింగ్ దాడులు జరగవచ్చు. గుర్తింపులేని యాప్‌లు, సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేస్తే డే టా దోపిడీ జరిగే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసుకోవాలి. మొబైల్ ఫోన్లను తరచూ స్విచ్చాఫ్ చేసి వెంటనే ఆన్ చేసుకుంటే మంచిది. ప్రజలు నిరంతరం పాస్‌వర్డ్ అప్డేట్ చేసుకోవాలి. సైబర్ పోలీసులు ఎప్పటికప్పుడు దర్యాప్తులో మెళకువలు నేర్చుకోవాలి’ అని సూచించారు. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి తేజా చింతలపాటి పలు కీలక సూచనలు చేశారు.