Share News

బియ్యపు గింజలపై శ్రీరామనామం

ABN , Publish Date - Mar 27 , 2026 | 10:23 AM

శ్రీరామ, శ్రీరామ శ్రీరామ.. అంటూ చాలా మంది భక్తులు రామకోటి రాస్తుంటారు. కానీ చందానగర్‌లో నివాసముంటున్న చలువాది మల్లి విష్ణు వందన అనే గృహిణి.. నోట్‌ బుక్కుల్లో గాకుం డా బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని రాస్తున్నారు.

బియ్యపు గింజలపై శ్రీరామనామం

  • శ్రద్ధగా లిఖించిన మల్లి విష్ణు వందన

  • నవమి సందర్భంగా 1.72లక్షల తలంబ్రాల సరఫరా

హైదరాబాద్‌ సిటీ: శ్రీరామ, శ్రీరామ శ్రీరామ.. అంటూ చాలా మంది భక్తులు రామకోటి రాస్తుంటారు. కానీ చందానగర్‌లో నివాసముంటున్న చలువాది మల్లి విష్ణు వందన అనే గృహిణి.. నోట్‌ బుక్కుల్లో గాకుం డా బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని రాస్తున్నారు. 2016లో ఆమె ప్రారంభించిన ‘శ్రీరామ’ నామ లిఖిత మహా క్రతువు ఇప్పటికీ పదేళ్లు కావొస్తుంది. ఈ పదేళ్లలో ఆమె 12,22,222 బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని లిఖించారు. ఇంట్లోనే ప్రతీరోజు సీతారాములకు పూజలు చేయడం, బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని రాస్తుంటారు.


రోజూ 10 గంటలకు పైగా బియ్యపు గింజలపై రకరకాల రంగుల పెన్నులను వినియోగించి రాస్తున్నారు. మొదటి ఏడాదిలోనే 1.65లక్షల బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని లిఖించి వాటిని ఏపీలోని ఒంటిమిట్ట ఆలయానికి తలంబ్రాల కోసం అందించారు ఏటా శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవంలో శ్రీరామ నామాన్ని లిఖించిన బియ్యపు గింజలను ప్రత్యేక తలంబ్రాలుగా అందిస్తున్నారు. శుక్రవారం జరిగే కల్యాణోత్సవానికి దేశవ్యాప్తంగా పలు ఆలయాలకు 1.72 లక్షల తలంబ్రాలను అందించడం విశేషం.


city4.2.jpgఇలా ప్రతీ ఏడాది లక్షకు పైగా బియ్య గింజల్లో రాయడం తలంబ్రాల కోసం ఒంటిమిట్ట, భద్రాచలం, హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు ఆలయాలకు మొత్తం 320 కల్యాణోత్సవాల్లో శ్రీరామనామం కలిగిన తలంబ్రాలను అందజేశారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవాలకు శ్రీరామనామ తలంబ్రాలను అందిస్తున్నారు. . ఆయా ప్రాంతాల్లోని రామ భక్తుల చేతుల మీదుగా 132 ఆలయాలకు తలంబ్రాలను చేరవేసినట్లు ఆమె తెలిపారు. భర్త ప్రోత్సాహంతోనే లిఖించానని, రీల్స్‌ అంటూ ఫోన్లకు పరిమితమవుతున్న ఈ పరిస్థితుల్లో శ్రీరామనామ విశిష్టతను తెలియజేసేందుకు ఈ ప్రయత్నం చేశానని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ కొరత లేదు

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 27 , 2026 | 10:26 AM