నేటి నుంచి శ్రీరామ పునర్వసు దీక్ష
ABN , Publish Date - Mar 27 , 2026 | 09:56 AM
భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం కానుంది.
ఏప్రిల్ 23న భద్రాద్రి రామాలయంలో స్వామి సన్నిధిలోనే విరమణ
ఆ మరుసటి రోజు శ్రీరామ దీక్షితుల కోసం పట్టాభిషేకం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం కానుంది. శ్రీరామ నవమి నాడు సీతారాముల కల్యాణం జరిగిన సాయంత్రం శ్రీరామ పునర్వసు దీక్షలు రామాలయ ప్రాంగణంలోని భద్రుని మండపంలో ప్రారంభం కానుంది. సకల అరిష్టాలను తొలగించి సర్వాభిష్టాలను ప్రసాదించే శ్రీరామ పునర్వసు దీక్షను అధిక శాతం మంది భక్తులు స్వీకరిస్తారు. 27 రోజుల పాటు దీక్ష నిర్వహించిన అనంతరం ఏప్రిల్ 23న దీక్షా విరమణను శ్రీరామ దీక్షితులు చేయనున్నారు.
అనంతరం వీరికోసం రాత్రి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగూ ఏప్రిల్ 24న శ్రీరామ దీక్షితుల కోసం శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ దీక్షను భక్తులు ఏ ప్రాంతంలోని స్థానిక రామాలయంలోనైనా స్వీకరించవచ్చు. కానీ దీక్షా విరమణ మాత్రం భద్రాద్రి రామయ్య సన్నిధిలో చేయాలని వైదిక సిబ్బంది పేర్కొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదు
గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News