Share News

శ్రీరామనవమికి ఆలయాల ముస్తాబు

ABN , Publish Date - Mar 26 , 2026 | 10:10 AM

శ్రీరామనవమిని పురస్కరించుకుని ముషీరాబాద్‌లోని రామాలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి.

శ్రీరామనవమికి ఆలయాల ముస్తాబు

  • సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు

  • రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరణ

హైదరాబాద్: శ్రీరామనవమిని పురస్కరించుకుని ముషీరాబాద్‌లోని రామాలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. ఈనెల 27వ తేదీన సీతారాముల కల్యాణాన్ని నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఆలయాలను అలంకరిస్తున్నారు. ఆలయాలకు రంగులువేసి, విద్యుత్‌ దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఆలయాలకు రంగులు, టెంట్లు, పెండ్లి పందిరి తదితర ఏర్పాట్లు చేశారు. ముషీరాబాద్‌ పార్సిగుట్టలోని ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం, గంగపుత్రకాలనీలోని సంజీవ ఆంజనేయస్వామి ఆలయం, బాలాపూర్‌ పద్మశాలీ కాలనీలోని హనుమాన్‌ ఆలయం, మహత్మానగర్‌లోని అభయాంజనేయస్వామి సహిత నవగ్రహ ఆలయంతో పాటు పలు హనుమాన్‌ ఆలయాలను ముస్తాబు చేశారు.


city6.jpgసీతారాముల కల్యాణం, భారీ ఏర్పాట్లు

శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆలయాల వద్ద పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. కల్యాణవేదిక, టెంట్లు ఇప్పటికే ఏర్పాటు చేశారు. స్వామి వారి కల్యాణం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. సీతారాముల కల్యాణం అనంతరం సాయంత్రం స్థానిక పురవీధుల్లో పల్లకిలో స్వామి వారిని ఊరేగించి భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.


భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

మహత్మానగర్‌లోని అభయాంజనేయస్వామి సహిత నవగ్రహ ఆలయం వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నాం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. మండుతున్న ఎండల నేపథ్యంలో కూలర్లను సహితం ఏర్పాటు చేస్తున్నాం. 16 సంవత్సరాలుగా కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నాం.

- బిజ్జి కనకేష్ కుమార్‌, అభయాంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌


ఈ వార్తలు కూడా చదవండి:

సీఎం రేవంత్‌ కేరళ పర్యటన రద్దు

ఏప్రిల్‌ 1 నుంచి చికెన్‌ షాపులు బంద్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 26 , 2026 | 10:13 AM