వారఫలాలు... ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే.?
ABN , Publish Date - Jul 19 , 2026 | 07:04 AM
ఈ వారం రాశిఫలాలు.. 19 - 25 జూలై 2026 పి.ప్రసూనారామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. లక్ష్యం నెరవేరుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. తరుచూ సన్నిహితులతో సంభాషిస్తుంటారు. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పనులు త్వరితగతిన సాగుతాయి. వ్యవహారానుకూలత ఉంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కీలక పత్రాలు అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టు కుంటారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే చికాకు పడతారు. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అప్రమత్తంగా ఉండాలి. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆకస్మిక ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. ధన సహాయం అర్థించేందుకు మనస్కరించదు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కష్టించినా ఫలితం శూన్యం. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఏ పనీ చేయబుద్థి కాదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు అభ్యంతరాలు ఎదురవుతాయి.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
తలపెట్టిన కార్యం సిద్థిస్తుంది. సమర్థతను చాటుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టిసారిస్తారు. ధనసహాయం తగదు. మొండిగా యత్నాలు సాగిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. పిల్లల దూకుడు అదుపు చేయండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్ద మొత్తం సాయం తగదు. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని సంఘటన ఎదురవుతుంది. వివాదాస్పద విషయాల జోలికిపోవద్దు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఒక సంబంధం కలిసివస్తుంది. అపరిచితులతో మితంగా సంభాషించండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ప్రతికూలతలను అధిగమిస్తారు. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సామాన్యం. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. గృహమార్పు అనివార్యం. పిల్లలకు శుభ ఫలితాలున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
కొంతమేరకు ఆశాజనకం. పరిస్థితులు చక్కబడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. పిల్లల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులు తారసపడ తారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగి స్తాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. గౌరవమర్యాదలు పెంపొందుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆటంకాలెదు రైనా అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. పిల్లల పట్ల సామరస్యంగా మెలగండి.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. ధనలాభం ఉంది. ఆపన్నులకు సాయం అందిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగదు. పెద్దల సలహా పాటించండి. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి.
ఈ వార్తలు కూడా చదవండి:
నిషేధిత జాబితా నుంచి ప్రైవేటు ఆస్తులను తొలగించాలి
కోట్లు కొల్లగొట్టిన ఆ దంపతులు అదుపులో?
Read Latest AP News And Telangana News And International News And Telugu News