Share News

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే.?

ABN , Publish Date - Jul 12 , 2026 | 07:13 AM

ఈ వారం రాశిఫలాలు.. 12 -18 జూలై 2026.. పి.ప్రసూనారామన్‌

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే.?
Weekly Horoscope

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

mesham.jpgసంతోషకరమైన వార్త వింటారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు, బాధ్యతలు అప్పగించ వద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు

vrushabham.jpgవ్యవహార ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగ వద్దు. అనుభవజ్ఞులను సంప్రదించండి. మీ నిర్ణయం వాయిదా వేయటం శ్రేయస్కరం. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదు పునకు అవకాశం లేదు. కొత్తపనులు చేపడ తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అందరితోనూ మితంగా సంభాషించండి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

mithunam.jpgఅనుకూలతలు నెలకొంటాయి. సమర్థతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ చక్కని సలహాలిస్తారు. ఊహించిన ఖర్చులేఉంటాయి. లైసెన్సుల రెన్యువల్‌లో జాప్యం తగదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ముఖ్యమైన వివరాలు వెల్లడించవద్దు. వివాహయత్నం ఫలిస్తుంది. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది.


కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విష యంపై ఆసక్తి ఉండదు. చిన్న విషయానికే చికాకుపడతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. పరిస్థితులు నిదానంగా చక్క బడతాయి. ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు తగ్గించుకుంటారు. కొత్త సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. అనవసర జోక్యం తగదు. సన్నిహితులకు మీ ఇబ్బందులు తెలియ జేయండి. కీలక పత్రాలు అందుకుంటారు.


సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

simham.jpgఅవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టించినా ఫలితం ఉండదు. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. సాయం ఆశించ వద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచు కోండి. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్తేజపరు స్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరవు. ముఖ్యమైన చెల్లింపుల్లో జాప్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు.


కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు

kanya.jpgసంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. నిలిపివేసిన పనులు పునః ప్రారంభిస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం.


తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgసర్వత్రా అనుకూలమే. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. విలాసా లకు విపరీతంగా వ్యయం చేస్తారు. అందరి తోనూ మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్య లను కొందరు వక్రీకరిస్తారు. పెద్దల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు త్వరితగతిన సాగుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. ఆహ్వానం అందుకుంటారు.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

vruchikam.jpgమీ కృషి ఫలిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఆత్మీయు లతో సంభాషిస్తుంటారు. గృహమరమ్మతులు చేపడతారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgకొంతమేరకు ఆశాజనకం. పరిస్థితులు చక్కబడతాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ సామర్థ్యంపై ఎదుటివారికి గురి కుదురుతుంది. సంప్రదిం పులకు అనుకూలం. ధనప్రలోభాలకు లోనుకావద్దు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆహ్వానం అందుకుంటారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgఅనుకూలతలు అంతంత మాత్రమే. ఆచితూచి అడుగేయాల్సిన సమయం. ఒంటెద్దుపోకడ తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆధిప త్యం ప్రదర్శించవద్దు. ఆశావహదృక్పఽథంతో మెలగండి. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రము ఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యతి రేకులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించ వద్దు. నమ్మినవారే మిమ్ములను తప్పుదారి పట్టిస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగి స్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆత్మీ యుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది.


మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meemam.jpgకార్యం సిద్ధిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. మీ కృషి ప్రశంసనీయమవు తుంది. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగు తాయి. ఆదాయం బాగుంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. పనులు చురు కుగా సాగుతాయి. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ నుంచి విషయేసకరణకు కొందరు యత్నిస్తారు. గృహమార్పు అని వార్యం. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

హే రామ్‌.. హే రావణ్‌.. ఇంత విద్వేషమా?

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 07:13 AM