Share News

హ్యాపీ బర్త్‌ డే.. సంజయ్‌

ABN , Publish Date - Jul 12 , 2026 | 06:16 AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ జన్మదినం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

హ్యాపీ బర్త్‌ డే.. సంజయ్‌

  • రాష్ట్రపతి, ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు

  • తెలంగాణ, మహారాష్ట్ర, బిహార్‌ సీఎంలు కూడా..

  • మురుగన్‌, పద్మనాభ ఆలయాల్లో బండి సంజయ్‌ పూజలు

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ జన్మదినం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రభుత్వంలో నా సహచరుడిగా, అలుపెరుగని కృషి, అపారమైన శక్తి, దృఢ సంకల్పంతో నవ భారత నిర్మాణం కోసం మీరు నిరంతరం శ్రమిస్తున్నారు. మీ పుట్టిన రోజు సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నా’ అని మోదీ ఆకాంక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, తెలంగాణ, మహారాష్ట్ర, బిహార్‌ సీఎంలు రేవంత్‌ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్‌, సామ్రాట్‌ చౌదరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌, కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, జైశంకర్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కిషన్‌ రెడ్డి, శ్రీపాద్‌ వై నాయక్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రమోద్‌ సావంత్‌, మోహన్‌ యాదవ్‌, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జులు సునీల్‌ బన్సల్‌, అభయ్‌ పాటిల్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ దంపతులు తదితరులు సంజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సంజయ్‌ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు కేక్‌ కట్‌ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేకంగా కోడె మొక్కులు చెల్లించారు. మరోవైపు సంజయ్‌, తమిళనాడులోని తుత్తుకూడు జిల్లా తిరుచందూర్‌లో ప్రసిద్ధి చెందిన మురుగన్‌ ఆలయాన్ని, కేరళలోని పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Jul 12 , 2026 | 06:16 AM