Share News

ప్రేమించి పెళ్లాడి.. ఏడాది లోపే..

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:37 PM

ప్రేమ వివాహం చేసుకున్న ఏడాదిలోపే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తిరుచ్చి జిల్లా రెడ్డియాపట్టి పెరుమాళ్‌ ఆలయ వీధికి చెందిన పొన్నర్‌-షాలిని (24) ప్రేమించుకోగా, వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వీరిద్దరూ గత ఏడాది వివాహం చేసుకున్నారు.

 ప్రేమించి పెళ్లాడి.. ఏడాది లోపే..
love marriage, woman suicide

చెన్నై: ప్రేమ వివాహం చేసుకున్న ఏడాదిలోపే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తిరుచ్చి జిల్లా రెడ్డియాపట్టి పెరుమాళ్‌ ఆలయ వీధికి చెందిన పొన్నర్‌-షాలిని (24) ప్రేమించుకోగా, వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వీరిద్దరూ గత ఏడాది వివాహం చేసుకున్నారు. పొన్నర్‌ తిరుచ్చి పాల డిపో ప్రాంతంలో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన అత్త వెల్లయమ్మాళ్‌తో కలసి షాలిని ఉంటోంది. పొన్నర్‌ సమయం దొరికినప్పుడు రెడ్డియాపట్టికి వచ్చి భార్యను చూసి వెళుతుంటాడు.


nani4.2.jpgఈ నేపథ్యంలో, ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో షాలిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఉప్పిలియపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తురైయూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివాహమై ఏడాది కూడా కాకపోవడంతో, ఈ వ్యవహారంపై ముసిరి మేజిస్ట్రేట్‌ విచారణ చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

విజయ్‌కు నీరా‘జనం’

పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ కలకలం..! 400 మందికి పైగా అస్వస్థత

Read Latest Telangana News and National News

Updated Date - Apr 21 , 2026 | 12:37 PM