Share News

స్పా ముసుగులో వ్యభిచారం

ABN , Publish Date - Mar 12 , 2026 | 10:42 AM

కూకట్‌పల్లి భాగ్యనగర్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కొంతకాలంగా స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతుందని సమాచారం రావడంతో మంగళవారం రాత్రి పోలీసులు దాడులు చేవారు.

స్పా ముసుగులో వ్యభిచారం

  • నిర్వాహకులతోపాటు ఆరుగురు యువతులు, ఓ విటుడు అరెస్ట్‌

హైదరాబాద్: కూకట్‌పల్లి భాగ్యనగర్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కొంతకాలంగా స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతుందని సమాచారం రావడంతో మంగళవారం రాత్రి పోలీసులు దాడులు చేవారు. సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి భాగ్యనగర్‌ కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో చామ్‌ వెల్‌నెస్‌ పేరుతో సెలూన్‌ నిర్వహిస్తున్నారు. లోపల వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో సైబరాబాద్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, కూకట్‌పల్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు.


city7.2.jpgఇద్దరు మహిళలు, ఒక యువకుడు కలిసి వెల్‌నెస్‌ సెంటర్‌ పేరుతో ఆన్‌లైన్‌లో విటులను పిలిచి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని వారి వద్ద నుంచి సెల్‌ ఫోన్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఒక విటుడు, ఆరుగురు యువతులతో పాటు ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు. కాలనీల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమచారం ఇవ్చాలని సీఐ సుబ్బారావు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

అతనికి అందిస్తున్నచికిత్సను నిలిపివేయొచ్చు!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 12 , 2026 | 10:42 AM