రీల్ చేస్తుండగా వ్యక్తి తప్పు ప్రవర్తన.. చావగొట్టిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్..
ABN , Publish Date - Mar 12 , 2026 | 09:43 AM
తనతో తప్పుగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మోనికా కబీర్ గట్టిగా బుద్ధి చెప్పింది. నడిరోడ్డుపై ఆ వ్యక్తిని పరిగెత్తించి మరీ కొట్టింది. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో బుధవారం చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: తనతో తప్పుగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి గట్టిగా బుద్ధి చెప్పిందో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. నడిరోడ్డుపై ఆ వ్యక్తిని తరిమి తరిమి కొట్టింది. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌కు చెందిన మోనికా కబీర్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్ చేయటం కోసం ఢాకాలోని రోడ్డుపైకి వచ్చింది. రీల్స్ షూట్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆమెను అసభ్యంగా తాకుతూ ముందుకు వెళ్లాడు. దీంతో మోనికా కోపం కట్టలు తెచ్చుకుంది. అతడిపై విరుచుకుపడింది.
చేతులతో, బ్యాగుతో రోడ్డుపైనే అతడిని తరిమి తరిమి కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై జనం మిశ్రమంగా స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది మోనికా కబీర్‌కు మద్దతుగా మాట్లాడుతూ ఉంటే.. మరికొంత మంది ఆమె తీరును తప్పుబడుతున్నారు. ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘పేద వాడిని కొడితే నువ్వు వైరల్ అవ్వొచ్చు అనుకుంటున్నావా?’..‘నీ మతి ఏమైనా పోయిందా ఏంటి?’..‘గట్టిగా బుద్ధి చెప్పావు. ఇలా చేస్తే ఆడవాళ్లను ఎవరూ వేధించలేరు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
శుభకార్యాలు, ఫంక్షన్లకు కుళ్లిన మాంసం సరఫరా
హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు.. జాతీయ జెండాను అవమానించాడంటూ..