Share News

రౌడీ బ్రదర్స్‌పై పీడీ యాక్ట్‌: సీపీ వీసీ సజ్జనార్‌

ABN , Publish Date - May 23 , 2026 | 09:36 AM

ఇద్దరు రౌడీషీటర్లపై పీడీయాక్ట్‌ నమోదు చేసినట్లు నగర సీపీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

రౌడీ బ్రదర్స్‌పై పీడీ యాక్ట్‌: సీపీ వీసీ సజ్జనార్‌
VC Sajjanar

హైదరాబాద్‌ సిటీ: ఇద్దరు రౌడీషీటర్లపై పీడీయాక్ట్‌ నమోదు చేసినట్లు నగర సీపీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన ఒమర్‌ బిన్‌ హంజా అల్‌ జాబ్రి, అలీ బిన్‌ హంజా అల్‌ జాబ్రి అనే ఇద్దరు అన్నదమ్ములు రౌడీషీటర్లు. కొంతకాలంగా నగరంలో హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూళ్లు, బెదిరింపులు వంటి పలు తీవ్రమైన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఆయుధాలతో అమాయక ప్రజలను బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడటమే కాకుండా భయాందోళనలకు గురిచేస్తున్నారని తెలిపారు.


city4.jpgఒమర్‌బిన్‌ హంజాపై ఇప్పటి వరకు 8 క్రిమినల్‌ కేసులు నమోదు కాగా, అలీబిన్‌ హంజాపై 7 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. రోజురోజుకూ శృతిమించడం, బెయిల్‌పై బయటకొచ్చి తిరిగి దందాలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు నివేదిక అందించారని తెలిపారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ఇద్దరిపై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తూ తాను ఆదేశాలు జారీ చేశానని పేర్కొన్నారు. రెయిన్‌బజార్‌ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్ ధరల ర్యాలీకి బ్రేక్.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

మా వాట్సాప్ గ్రూప్‌లోనూ వైభవ్ గురించే చర్చిస్తున్నాం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 23 , 2026 | 09:36 AM