ఎండ వేడికి అల్లాడిన గబ్బిలం.. మానవత్వం చాటుకున్న లాయర్లు.. వీడియో వైరల్
ABN , Publish Date - May 23 , 2026 | 07:16 AM
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మానవత్వాన్ని చాటే ఒక సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్నిరోజులుగా బుందేల్‌ఖండ్ ప్రాంతంలో వడగాలుల తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో మనుషులతో పాటు పశుపక్షాదులు కూడా అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టు ప్రాంగణంలో మానవత్వాన్ని చాటే ఒక సంఘటన చోటుచేసుకుంది. తీవ్రమైన వేడిని తట్టుకోలేక కోర్టు ఆవరణలోని చెట్టు పైనుంచి ఒక గబ్బిలం కింద పడిపోయి కదలలేని స్థితిలో ఉంది.
గబ్బిలం కిందపడటాన్ని గమనించిన న్యాయవాదులు వెంటనే స్పందించారు. గబ్బిలానికి ఊరట లభించేలా దానిపై కొద్దిగా నీళ్లు చల్లారు. అనంతరం కొద్ది కొద్దిగా నీటిని తాగించారు. న్యాయవాదులు చేసిన ఈ సాయంతో కాసేపటికే ఆ గబ్బిలం కోలుకుంది. నెమ్మదిగా కదలుతూ.. నీటిని తాగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గబ్బిలం ప్రాణాన్ని కాపాడిన న్యాయవాదులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అయ్యో.. వరదలో కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్