Share News

విద్యార్థినికి తేనెటీగల గడ్డం

ABN , Publish Date - May 22 , 2026 | 12:32 PM

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం కీటక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ తేనెటీగల దినోత్సవం నిర్వహించారు.

విద్యార్థినికి తేనెటీగల గడ్డం
Coimbatore Student

చెన్నై: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం కీటక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ తేనెటీగల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కీటక శాస్త్ర విభాగం నాలుగవ సంవత్సరం విద్యార్థిని భాగ్యలక్ష్మి, తన ముఖంపై తేనెటీగలతో గడ్డంలా ఉంచుకుని పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... తేనేటీగలను చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు.


nani2.2.jpgవాటిని అర్ధం చేసుకుని, ఎలా మసలుకోవాలో తెలిపేలా చేపట్టిన ఈ అవగాహన ప్రచారంలో, ‘ఏపిస్‌ సెరానా ఇండిక’ అని పిలువబడే 20 వేల భారతీయ తేనెటీగలతో ముఖం కప్పుకున్నట్లు భాగ్యలక్ష్మి తెలిపారు. కాగా, భాగ్యలక్ష్మితో సహచార విద్యార్థులు, అధ్యాపకులు, ముఖ్యఅతిథులు సెల్ఫీ తీసుకున్నారు.


nani2.jpgఈ వార్తలు కూడా చదవండి:

కిడ్నీ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు

చేదెక్కిన మామిడి..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 22 , 2026 | 12:33 PM