Share News

కాళ్ల పారాణి ఆరకముందే...

ABN , Publish Date - Mar 25 , 2026 | 01:17 PM

కాళ్ల పారాణి ఆరకముందే ఓ యువతి కన్నుమూసింది. స్థానిక ఆవడి సమీపంలో వందే భారత్‌ రైలు ఢీకొని యువతి మృతిచెందడంపై పోలీసులు విచారణ చేపట్టారు.

కాళ్ల పారాణి ఆరకముందే...

  • వందే భారత్‌ రైలు ఢీకొని యువతి మృతి

చెన్నై: కాళ్ల పారాణి ఆరకముందే ఓ యువతి కన్నుమూసింది. స్థానిక ఆవడి సమీపంలో వందే భారత్‌ రైలు(Vande Bharat Train) ఢీకొని యువతి మృతిచెందడంపై పోలీసులు విచారణ చేపట్టారు. ముగప్పెర్‌ పాడసాలై మొదటి వీధికి చెందిన కార్తీక్‌, సత్య (25)లకు నెల రోజుల క్రితం వివాహమైంది. ఈ నెల 21వ తేది ఆ దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఆగ్రహం చెందిన సత్య, పట్టాభిరామ్‌ సత్రం ప్రాంతంలో పుట్టింటికి వెళ్లింది. తండ్రి ప్రభు, కుమార్తెను బుజ్జగించి సోమవారం మధ్యాహ్నం భర్త ఇంటికి పంపాడు.


ఈ క్రమంలో పట్టాభిరామ్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు ఢీకొని సత్య మృతి చెందినట్లు ఆవడి రైల్వే పోలీసులకు సమాచారం అందింది. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్గంకు తరలించారు. ప్రాథమిక విచారణలో, చెన్నై నుంచి అరక్కోణం వెళ్తున్న వందే భారత్‌ ఢీకొని మృతిచెందినట్లు తెలిసింది. సత్య ఆత్మహత్యకు పాల్పడిందా? రైలు పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు చనిపోయిందా.. అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కాంగ్రెస్ పార్టీకి షాక్.. ప్రధాన కార్యాలయం ఖాళీ చేయాలంటూ నోటీసు

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

Read Latest Telangana News and National News

Updated Date - Mar 25 , 2026 | 01:17 PM