పాన్‌షాప్ సీజ్.. మనస్తాపంతో వ్యాపారి హఠాన్మరణం
ABN , Publish Date - Apr 24 , 2026 | 09:22 AM
పాతికేళ్లుగా నిర్వహిస్తున్న పాన్‌షాపు సీజ్ కావడంతో ఉపాధి పోయిందని మనస్తాపం చెందుతూ బోరబండకు చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు.
హైదరాబాద్: పాతికేళ్లుగా నిర్వహిస్తున్న పాన్‌షాపు సీజ్ కావడంతో ఉపాధి పోయిందని మనస్తాపం చెందుతూ బోరబండకు చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. విద్యాసంస్థలకు చేరువలో పొగాకు ఉత్పత్తుల విక్రయం జరపరాదన్న నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు బోరబండ పోలీసులు ఇటీవల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తొమ్మిది పాన్‌షాపులు సీజ్ చేశారు. వాటిలో సైట్ త్రీ కాలనీ గావ్ టీ హోటల్ దగ్గర ఉన్న సయ్యద్ ఇసాఖ్ (52) పాన్‌షాపు కూడా ఉంది.
సీజ్ చేసిన షాపును తెరిపించేందుకు అతను పలుమార్లు ఠాణాకు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. షాపు సీజ్ కావడంతో ఉన్న ఉపాధి పోయిందని తీవ్రంగా కలత చెందేవాడని కుటుంబీకులు తెలిపారు. గుండెపోటుతో గురువారం ఉదయం మృతి చెందాడని చెప్పారు. సైట్ వన్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న అతడి కుమార్తె వివాహం ఈ మధ్యే జరిగిందని, కొడుకు చదువుకుంటున్నాడని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి, వెండి ధరలు మరింత పతనం
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం.. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి..
Read Latest Telangana News and National News