30 శాతం లాభాలు ఆశచూపి.. రూ.12.79 లక్షలు కాజేసి..
ABN , Publish Date - Apr 21 , 2026 | 09:51 AM
తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే 30 శాతం లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.12.79 లక్షలు కాజేశారు.
హైదరాబాద్ సిటీ: తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే 30 శాతం లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.12.79 లక్షలు కాజేశారు. నాగారం ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు అతడి నంబరును వాట్సాప్ గ్రూపులో చేర్చారు. క్రమం తప్పకుండా స్టాక్ మార్కెట్ చిట్కాలు, షేర్‌ల కొనుగోలు, విక్రయాల గురించి సిఫార్సులు ఇచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టాలని సూచించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు వారు పంపిన లింక్‌ల ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు.
ముందుగా రూ.40 వేలు పెట్టుబడి పెడితే 30శాతం లాభాలు వచ్చినట్లు చూపారు. విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించడంతో నమ్మిన బాధితుడు పలు దఫాలుగా రూ.12.79 లక్షలు పెట్టుబడి పెట్టాడు. వాటిని విత్‌డ్రా చేసుకునే యత్నం చేయగా, మరిన్ని పెట్టుబడులు పెట్టాలని పట్టుబట్టారు. అతడి ఖాతాను సైతం నిలిపివేశారు. దాంతో బాఽధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
సినీనటి అనసూయపై అసభ్యకర కామెంట్లు..
కాకిని కొనుక్కొచ్చి.. పిండాన్ని ముట్టించి..
Read Latest Telangana News and National News