Share News

సినీనటి అనసూయపై అసభ్యకర కామెంట్లు..

ABN , Publish Date - Apr 21 , 2026 | 08:49 AM

సినీనటి అనసూయపై సోషల్‌ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని సైబర్‌ కైరమ్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు.

సినీనటి అనసూయపై అసభ్యకర కామెంట్లు..
Actor Anasuya

  • నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: సినీనటి అనసూయపై సోషల్‌ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని సైబర్‌ కైరమ్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. సైబర్‌ క్రైం డీసీపీ టి.సాయి మనోహర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది డిసెంబర్‌ 23 నుంచి పలువురు వ్యక్తులు సోసల్‌ మీడియాలో నటి అనసూయపై అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు.


city5.2.jpgఈ కేసులో నల్లగొండ జిల్లా అల్వాల గ్రామానికి చెందిన దొరేపల్లి చంటి(30) అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘చంటిదోరపల్లి’ ఖాతా ద్వారా అతడు అభ్యంతరకర కంటెంట్‌ను ప్రచారం చేసినట్లు గుర్తించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డీసీపీ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి

కాకిని కొనుక్కొచ్చి.. పిండాన్ని ముట్టించి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 21 , 2026 | 08:49 AM