Share News

హ్యాట్రిక్‌పై సన్‌రైజర్స్‌ గురి

ABN , Publish Date - Apr 21 , 2026 | 07:14 AM

రెండు వరుస విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌పై గురిపెట్టింది. ఉప్పల్‌లో మంగళవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఇరుజట్లూ ఆరు పాయింట్లతో...

హ్యాట్రిక్‌పై సన్‌రైజర్స్‌ గురి

నేడు ఢిల్లీతో పోరు

వేదిక: హైదరాబాద్‌ రా.7.30 నుంచి

హైదరాబాద్‌: రెండు వరుస విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌పై గురిపెట్టింది. ఉప్పల్‌లో మంగళవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఇరుజట్లూ ఆరు పాయింట్లతో సమంగా ఉన్నా.. రన్‌రేట్‌లో సన్‌రైజర్స్‌ది పైచేయిగా ఉంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ అందుబాటులో లేకపోవడం వల్ల ఆరంభంలో హైదరాబాద్‌ బౌలింగ్‌ కొంత బలహీనంగా కనిపించింది. కానీ, గత రెండు మ్యాచ్‌ల్లో ప్రఫుల్‌ హింగే, ఎషాన్‌ మలింగ, శివాంగ్‌ కుమార్‌, సకీబ్‌ హసన్‌ బంతితో సత్తాచాటుతుండడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో హింగే తొలి ఓవర్‌లోనే నిప్పులు చెరగ్గా.. చెన్నైతో మ్యాచ్‌లో డెత్‌ ఓవర్లలో బౌలర్లు సమష్టిగా రాణించారు. అయితే, బ్యాటింగ్‌ విభాగం నిలకడలేమితో ఇబ్బందులు పడుతోంది. దూకుడైన ఆటకే సన్‌రైజర్స్‌ కట్టుబడినా..ఆశించిన ఫలితాలు రావడం లేదు. మరోవైపు ఢిల్లీ ఆటతీరు పడుతూలేస్తూ సాగుతోంది. అనుభవజ్ఞులైన కేఎల్‌ రాహుల్‌, నిస్సాంక, ట్రిస్టన్‌ స్టబ్స్‌ నుంచి జట్టు భారీ స్కోర్లు ఆశిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో మెరిసిన సమీర్‌ రిజ్వీ.. గత మూడు మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతుండడం ఆందోళన కలిగించే అంశం. స్టార్‌ పేసర్‌ స్టార్క్‌ అందుబాటులో లేకపోయినా.. ఎన్‌గిడితోపాటు ముకేశ్‌ కుమార్‌, నటరాజన్‌ ఆ లోటును భర్తీ చేస్తున్నారు. కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ పొదుపుగా బంతులేస్తున్నా.. కుల్దీప్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతున్నాడు.

Also Read:

ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం

For More Latest News

Updated Date - Apr 21 , 2026 | 07:14 AM