Share News

ఎక్కడికీ వెళ్లేది లేదు..!

ABN , Publish Date - Apr 21 , 2026 | 03:18 AM

ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి తప్పుకొనేది లేదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంతశర్మ పరోక్షంగా ప్రకటించారు. తాను ఎక్కడికీ వెళ్లేది లేదని..

ఎక్కడికీ వెళ్లేది లేదు..!

  • ఢిల్లీ మద్యం కేసులో నా విధిని నిర్వర్తిస్తా

  • కేజ్రీవాల్‌తో పాటు ఇతరుల రెక్యూసల్‌ పిటిషన్లను కొట్టివేసిన జస్టిస్‌ స్వర్ణకాంత

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి తప్పుకొనేది లేదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంతశర్మ పరోక్షంగా ప్రకటించారు. తాను ఎక్కడికీ వెళ్లేది లేదని.. తన విధిని తాను పూర్తి చేస్తానన్నారు. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్‌ స్వర్ణకాంతశర్మ తప్పుకోవాలంటూ మాజీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌తో పాటు ఇతర నిందితులు దాఖలు చేసిన (రెక్యూసల్‌) పిటిషన్లను ఆమె కొట్టివేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా న్యాయమూర్తిపై ఓ లిటిగెంట్‌ ఆరోపణలు చేయడాన్ని అనుమతించలేమన్నారు. పక్షపాతంగా వ్యవహరిస్తారనే నిరాధార అనుమానాన్ని సంతృప్తిపర్చడానికి న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకోలేరన్నారు. ఈ కేసు సాక్ష్యాలతో కాకుండా కేవలం సందేహాలు, ఊహాగానాలతో ముందుకొచ్చిందన్నారు. ‘ఎటువంటి ఆధారాల్లేకుండా ఓ రాజకీయ నాయకుడు ఓ వ్యవస్థకు నష్టం కలిగించడానికి అనుమతించలేం. ఓ న్యాయమూర్తిపై వ్యక్తిగత దాడి అంటే అది న్యాయవ్యవస్థపైనే దాడి.. ఈ కోర్టు తన కోసం.. ఈ వ్యవస్థ కోసం నిలబడుతుంది.. ఎక్కడికీ వెళ్లేది లేదు. నా విధిని నేను పూర్తిచేశాకే వెళ్తా..’ అని అన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 03:18 AM