Share News

80 ఏళ్ల వృద్ధుడికి టోకరా.. రూ. 24.38 లక్షలు స్వాహా

ABN , Publish Date - Mar 07 , 2026 | 08:17 AM

సైబర్‌ నేరగాళ్లు పెట్టుబడుల పేరిట వృద్ధుడిని మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

80 ఏళ్ల వృద్ధుడికి టోకరా.. రూ. 24.38 లక్షలు స్వాహా

  • పెట్టుబడుల పేరుతో మోసం

హైదరాబాద్‌ సిటీ: సైబర్‌ నేరగాళ్లు పెట్టుబడుల పేరిట వృద్ధుడిని మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గోపనపల్లి(Gopanapalli) ప్రాంతానికి చెందిన 80 ఏళ్ల రిటైర్డ్‌ కన్సల్టెంట్‌ (బాధితుడు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిధివెలే అనే మహిళ పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని చెప్పి బాధితుడిని నమ్మించింది. ఆమె మాటలను నమ్మిన బాధితుడు ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా పెట్టుబడి పెట్టారు. కొంతకాలం భారీ లాభాలు వచ్చినట్లు బాధితుడికి తప్పుడు సమాచారం అందించారు.


city3.2.jpgభారత కరెన్సీలో సుమారు రూ.62,77,040లు అకౌంట్‌ల్లో ఉన్నట్లు నమ్మించారు. అయితే ఆ డబ్బు విడుదల చేయాలంటే ముందుగా ‘కన్వర్షన్‌ ఫీ’ చెల్లించాలని కోరారు. వారి మాటలను నమ్మిన బాధితుడు వివిధ బ్యాంక్‌ ఖాతాలకు మొత్తంగా రూ.24,38,483 ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. మరింత డబ్బు డిమాండ్‌ కోరడంతో మోసం జరిగినట్లు గ్రహించి బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వంటగ్యాస్ షాక్.. దేశంలో ఎల్పీజీ ధరలు భారీగా పెంపు

బెంచీలు కొన్నారు.. పిల్లలు నేలపైనే కూర్చున్నారు!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 07 , 2026 | 08:17 AM