ఆ ఏరియాల్లో 9గంటల నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Mar 07 , 2026 | 07:06 AM
టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో సమ్మర్ యాక్షన్ పనుల్లో భాగంగా శనివారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో సమ్మర్ యాక్షన్ పనుల్లో భాగంగా శనివారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మూసాపేట, గూడ్‌షెడ్‌రోడ్డు, ఆంజనేయనగర్, హబీబ్‌నగర్, ప్రగతినగర్, రాజీవ్‌గాంధీనగర్, సర్దార్‌నగర్, రాఘవేంద్రకాలనీ, హానర్ ప్రాజెక్ట్, మైస్టిక్‌హిల్స్ విల్లాస్, వాసవీ అపార్ట్‌మెంట్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ పేర్కొన్నారు.
ఉప్పల్: నిర్వహణ పనుల నేపథ్యంలో బోడుప్పల్ సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు 11 కేవీ సత్తిరెడ్డి కాలనీ ఫీడర్‌లో సత్తిరెడ్డి కాలనీ, సాయి రామ్‌నగర్, బృందావన్ కాలనీ, సాయి భవాని నగర్, శ్రీనివాస కాలనీ, ఉడా లక్ష్మీ నగర్, కేశవ నగర్, ఎన్‌టీఆర్ విగ్రహం లైన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
బౌద్ధనగర్: చెట్లకొమ్మల నరికివేత, కేబుల్‌లైన్‌ల మరమ్మతుల కారణంగా అజామాబాద్ విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయం పరిధిలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. హరాజ్‌పెంటా, గోల్నాక, అంబర్‌పేట్ ప్లే గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి 3 గంటల వరకు, నెహ్రూనగర్, కాచిగూడ, పార్శీగుట్ట, జమీస్తాన్‌పూర్, 44వ బస్టాప్, శాస్త్రీనగర్, రాంనగర్ ప్రాంతాల్లో సాయంత్రం 3గంటల నుంచి 4 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వంటగ్యాస్ షాక్.. దేశంలో ఎల్పీజీ ధరలు భారీగా పెంపు
బెంచీలు కొన్నారు.. పిల్లలు నేలపైనే కూర్చున్నారు!
Read Latest Telangana News and National News