99 రోజుల ప్లాన్.. డైవర్షన్ డ్రామా
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:49 AM
ప్రజాపాలన గ్రామసభల్లో ప్రజలు రెండుసార్లు సమర్పించిన లక్షల దరఖాస్తులు చెత్తబుట్టల్లో మగ్గుతున్నాయని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్ చేపట్టే 99 రోజుల...
800 రోజుల వైఫల్యాలను
కప్పిపుచ్చుకునేందుకే ప్రగతి ప్రణాళిక: హరీశ్
హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన గ్రామసభల్లో ప్రజలు రెండుసార్లు సమర్పించిన లక్షల దరఖాస్తులు చెత్తబుట్టల్లో మగ్గుతున్నాయని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్ చేపట్టే 99 రోజుల ప్లాన్ అంతా డైవర్షన్ డ్రామా.. అని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. చాలా వరకు సంక్షేమ పథకాలను తుంగలో తొక్కారని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ 800 రోజుల వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రణాళికతో ముందుకు వచ్చిందన్నారు. ఇది కేవలం ప్రచార ఆర్భాటానికి తప్ప ప్రజలకు దీని వల్ల ఒరిగేది ఏమీ లేదని విమర్శించారు. లబ్ధిదారులు గతంలో చేసుకున్న దరఖాస్తులకే దిక్కులేదనీ, మళ్లీ పది వారాలపాటు పది రకాల నాటకాలతో ప్రజలను మోసం చేేసందుకు సిద్ధమవ్వడం సిగ్గుచేటన్నారు. రైతు భరోసా ఊసే లేదని, పంటకు బోనస్ ఇవ్వడం లేదని, యూరియా కొరతతో రైతాంగాన్ని రోడ్డుపైకి ఈడ్చారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్.. ‘జాబ్‌లెస్’ క్యాలెండర్‌గా మారిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్, పారిశుధ్యం వంటి కనీస బాధ్యతలను కూడా ఒక ఈవెంట్‌లాగా కలర్ ఇచ్చుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని ఆయన విమర్శించారు.