పిల్లల సంఖ్య కాదు.. నైపుణ్యాలు ముఖ్యం
ABN , Publish Date - Mar 07 , 2026 | 06:14 AM
‘దేశంలో ఉన్న కోట్లాది మంది యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాలు కల్పించకుండా జనాభాను పెంచడం ఎవరి కోసం? విద్య, ఆరోగ్యం, మానవ వనరుల అభివృద్ధిని...
రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు ప్రకటన
ఏపీ జనాభా విధానంపై మాణిక్కం ఠాగూర్ విమర్శలు
న్యూఢిల్లీ, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ‘దేశంలో ఉన్న కోట్లాది మంది యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాలు కల్పించకుండా జనాభాను పెంచడం ఎవరి కోసం? విద్య, ఆరోగ్యం, మానవ వనరుల అభివృద్ధిని వదిలేసి నగదు ప్రోత్సాహకాలతో జనాభా పెంచడం అభివృద్ధి అనిపించుకుంటుందా? ప్రస్తుత ఏఐ యుగంలో దేశానికి కావాల్సింది జనాభా సంఖ్యా? లేక విద్యావంతులైన, ఉపాధి ఉత్పాదకత ఉన్న పౌరులా?’’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఎంపీ మాణిక్కం ఠాగూర్ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై ఆయన శుక్రవారం ‘ఎక్స్’లో తీవ్ర విమర్శలు చేశారు.