Share News

కొడుకో.. బిడ్డో పుడతారని.. సంతోషంలో ఉండగా..

ABN , Publish Date - Feb 21 , 2026 | 09:46 AM

నాలుగు నెలల గర్భిణి సునీతను ఆమె మాజీ భర్త దారుణంగా హతమార్చిన ఘటనపై ప్రస్తుత భర్త ఉడుకుల శ్రీనాథ్‌ పోలీసుల ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

కొడుకో.. బిడ్డో పుడతారని.. సంతోషంలో ఉండగా..

  • అంతలోనే నా భార్యను చంపేశాడు

  • ఆమెకు ముందే పెళ్లైన విషయం తెలియదు

  • సునీత హత్య కేసులో మృతురాలి భర్త

హైదరాబాద్‌ సిటీ: నాలుగు నెలల గర్భిణి సునీతను ఆమె మాజీ భర్త దారుణంగా హతమార్చిన ఘటనపై ప్రస్తుత భర్త ఉడుకుల శ్రీనాథ్‌ పోలీసుల ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన భార్యను హత్య చేసిన మహేష్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తులో భాగంగా ఫిర్యాదుదారుడు శ్రీనాథ్‌ను కూడా విచారించారు.


కొడుకో బిడ్డో పుడతారని..

‘2024లో సునీతతో బేగంపేటలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2025 ఏప్రిల్‌లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అప్పటికే ఆమెకు మహేష్‌తో పెళ్లైన విషయం నాకు తెలియదు. ఇప్పుడు నా భార్య నాలుగు నెలల గర్భ వతి. మరో 5 నెలల్లో మాకు పాపో, బాబో పుట్టబోతున్నారని ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇంతలోనే ఈ దారుణం జరిగింది.’ అని శ్రీనాథ్‌ పోలీసుల ఎదుట కంటతడి పెట్టినట్లు తెలిసింది. బుధవారం మధ్యాహ్నం అమ్మ ఫోన్‌ చేసి ఎవరో సునీతను దారుణంగా చంపేశాడని చెప్పగానే కంగుతిన్నానని అన్నారు.


ఇదిలా ఉండగా.. 2014 నుంచి ప్రేమలో ఉన్న మహేష్‌, సునీత 2022లో వివాహం చేసుకున్నారు. 2023లో భర్తతో పాటు కెనడాకు వెళ్లిన ఆమె కేవలం 10-15 రోజుల్లోనే మహే్‌షతో గొడవపడి అక్కడి పోలీసుల సహకారంతో ఇండియాకు తిరిగి వచ్చినట్లు తెలిసింది. మహేష్‌, అతని తల్లిదండ్రులపై గృహహింస కేసు పెట్టి కోర్టుకు వెళ్లకుండానే పెద్దల సమక్షంలో విడాకులు తీసుకుంది. కానీ ఆమె పెట్టిన కేసుల వల్ల మహేష్‌, అతని తల్లిదండ్రులు పోలీస్‏స్టేషన్‌లు, కోర్టుల చుట్టూ తిరిగారు.


ఆ తర్వాత అవమాన భారంతో మహేష్‌ తల్లి గుండెపోటుతో మరణించారు. దాంతో ఇండియా వదిలేసి తిరిగి కెనడాకు వెళ్లాలని నిర్ణయించుకున్న మహేష్‏కు వీసా రాలేదు. సునీత పెట్టిన కేసులు అడ్డంకిగా మారాయి. దీంతో ఆవేశంతో రగిలిపోయి సునీత ఉంటున్న అడ్రస్‏కు వచ్చి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. త్వరలోనే నిందితునిపై చార్జిషీట్‌ ఫైల్‌ చేస్తామని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మెడికల్‌ పీజీ కోర్సులకు లైన్‌ క్లియర్‌

చరిత్రను తిరగరాసిన సరిత

Read Latest Telangana News and National News

Updated Date - Feb 21 , 2026 | 09:46 AM