కంపెనీ ఉన్నతాధికారినని నమ్మించి.. రూ.18 లక్షలు కాజేత
ABN , Publish Date - Jun 10 , 2026 | 07:15 AM
సైబర్ నేరగాళ్లు కొత్త అవతారమెత్తి ఓ కార్పొరేట్ సంస్థను మోసం చేశారు. సంస్థ ఉన్నతాధికారినని మైక్రోసాఫ్ట్ టీమ్స్ చాట్ ద్వారా ఫైనాన్స్ మేనేజర్‌ను నమ్మించి రూ.18 లక్షలు కాజేశారు.
కార్పొరేట్ సంస్థకు సైబర్ నేరగాళ్ల టోకరా
హైదరాబాద్ సిటీ: సైబర్ నేరగాళ్లు కొత్త అవతారమెత్తి ఓ కార్పొరేట్ సంస్థను మోసం చేశారు. సంస్థ ఉన్నతాధికారినని మైక్రోసాఫ్ట్ టీమ్స్ చాట్ ద్వారా ఫైనాన్స్ మేనేజర్‌ను నమ్మించి రూ.18 లక్షలు కాజేశారు. మోసపోయామని తెలుసుకుని సదరు మేనేజర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని అడాప్ట్ ఐడియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఫైనాన్స్ మేనేజర్‌గా పి. సూర్య పనిచేస్తున్నారు.
జూన్ 2న సంస్థ మేనేజ్‌మెంట్ అధికారినని గుప్తా అనిర్బన్ అనే వ్యక్తి మైక్రోసాఫ్ట్ టీమ్స్ చాట్ ద్వారా మాట్లాడుతూ అత్యవసరంగా రూ.18లక్షలు చెల్లింపు చేయాలని ఫైనాన్స్ మేనేజర్‌కు సూచించాడు. లబ్ధిదారుడి బ్యాంకు వివరాలను ఔట్‌లుక్ ఈ-మెయిల్ ద్వారా పంపించాడు. ఆ సూచనలు నిజమైనవని భావించిన ఫైనాన్స్ విభాగం ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా బదిలీ చేసింది.
అయితే, చెల్లింపు పూర్తయిన తర్వాత ఆ సందేశాలు పంపిన వ్యక్తి అసలు అధికారి కాదని, సైబర్ మోసగాడని గుర్తించారు. వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించి ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేయించారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News