టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై కేసు
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:22 PM
చెన్నై నగరంలో నిబంధనలు అతిక్రమించి రోడ్ షో చేపట్టారంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై మూడు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
చెన్నై: నగరంలో నిబంధనలు అతిక్రమించి రోడ్ షో చేపట్టారంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై మూడు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. టి.నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నిబంధనలు అతిక్రమించారంటూ ఎన్నికల అధికారి సంతోష్ కుమార్ అందజేసిన ఫిర్యాదుతో, ప్రభుత్వ అధికారి ఉత్తర్వులు ఉల్లంఘించారు సహా రెండు సెక్షన్ల కింద మాంబళం పోలీసులు, విజయ్,
టీవీకే అభ్యర్థి ఆనంద్ సహా పలువురిపై కేసు నమోదుచేశారు. అలాగే, వళ్లువర్‌కోట్టం, వెప్పేరి ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఈ చర్యలు నిబంధనల అతిక్రమణ అంటూ నుంగంబాక్కం, వెప్పేరి పోలీసు స్టేషన్‌లోనూ కేసు నమోదుచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఇది ట్రైలర్ మాత్రమే.. మెయిన్ పిక్చర్ చూడాలని ఆశపడొద్దు
Read Latest Telangana News and National News