Share News

పోలవరంలో పెద్ద పులి కలకలం.. భయాందోళనలో కార్మికులు..

ABN , Publish Date - Apr 17 , 2026 | 11:44 AM

పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నమైన కార్మికుల కంట ఈ పులి పడటంతో భయాందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే..

పోలవరంలో పెద్ద పులి కలకలం.. భయాందోళనలో కార్మికులు..
Polavaram Tiger News

పోలవరం, ఏప్రిల్ 17: పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నమైన కార్మికుల కంట ఈ పులి పడటంతో భయాందోళన నెలకొంది. పెద్ద పులిని నేరుగా చూసిన కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. జనసంచారం ఉన్న ప్రాంతంలోకి పులి రావడంతో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందన్న భయంతో కార్మికులు పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ సమాచారం అందగానే ప్రాజెక్ట్ అధికారులు, అటవీ శాఖ అప్రమత్తమయ్యారు.


రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి మెడలో 'రేడియో కాలర్' ఉండటాన్ని గుర్తించారు. దీని సహాయంతో పులి ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఏ దిశగా వెళ్తోంది? అనే అంశాలను శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. పెద్దపులికి మత్తుమందు ఇచ్చి బంధించేందుకు రాజమండ్రి నుంచి ప్రత్యేక అనస్థీషియా నిపుణుల బృందం పోలవరానికి చేరుకుంది. పులి సంచరించే అవకాశం ఉన్న మార్గాల్లో బోన్లను ఏర్పాటు చేయడంతో పాటు, అటవీ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల ప్రజలు, కార్మికులు ఒంటరిగా తిరగవద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి

పెళ్లికి బంగారం, పట్టుచీర.. రైతులకు రుణమాఫీ.. విజయ్ మ్యానిఫెస్టో ఇదే..

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను ఎస్‌ఎమ్‌సీలకు అప్పగించండి: మంత్రి లోకేశ్‌

Updated Date - Apr 17 , 2026 | 12:02 PM