Share News

పెళ్లికి బంగారం, పట్టుచీర.. రైతులకు రుణమాఫీ.. విజయ్ మ్యానిఫెస్టో ఇదే..

ABN , Publish Date - Apr 16 , 2026 | 09:10 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ తన పార్టీ టీవీకే మ్యానిఫెస్టోను విడుదల చేశారు. మహిళలు, రైతులపై వరాల జల్లు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 60 ఏళ్ల వయసు లోపు ఉన్న మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తామని ప్రకటించారు.

పెళ్లికి బంగారం, పట్టుచీర.. రైతులకు రుణమాఫీ.. విజయ్ మ్యానిఫెస్టో ఇదే..
Vijay TVK manifesto

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ తన పార్టీ టీవీకే మ్యానిఫెస్టోను విడుదల చేశారు. మహిళలు, రైతులపై వరాల జల్లు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 60 ఏళ్ల వయసు లోపు ఉన్న మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తామని ప్రకటించారు. అలాగే పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు (Vijay TVK manifesto Tamil Nadu).


స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌లను నిర్మూలించేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. అలాగే ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతుల రుణాలను 50 శాతం మాఫీ చేస్తామన్నారు. అలాగే ఓ కుటుంబానికి ఏడాదికి ఉచితంగా ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు (Tamil Nadu elections 2026).


పట్టభద్రులైన నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల ఆర్థిక సహాయం చేస్తామన్నారు (TVK party policies). అలాగే కొత్తగా ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తామన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు నెలకు రూ.3 వేల పింఛను ఇస్తామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా, ఏఐ మంత్రిత్వ శాఖ, ఏఐ యూనివర్సిటీ, ఏఐ సిటీ ఏర్పాటు చేస్తామని విజయ్ హామీల వర్షం కురిపించారు. అలాగే మహిళలు తమ ఇళ్ల ముందు టీవీకే పార్టీ గుర్తు అయిన విజిల్ ముగ్గు వేయాలని సూచించారు.


ఇవి కూడా చదవండి..

అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు.. సమాచారం లేదంటున్న పాకిస్థాన్


వేలాది అమెరికా సైనికులను బందీలుగా పట్టుకుంటాం: ఇరాన్ హెచ్చరిక


లాభాల నుంచి నష్టాల్లోకి.. స్టాక్ మార్కెట్లకు నష్టాలు..

Updated Date - Apr 16 , 2026 | 09:18 PM