Share News

లాభాల నుంచి నష్టాల్లోకి.. స్టాక్ మార్కెట్లకు నష్టాలు..

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:59 PM

గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయ సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఉదయం లాభాలతో ప్రారంభమై చివరకు నష్టాలతో ముగిశాయి. ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాలు కూడా సూచీలను కిందకు లాగాయి.

లాభాల నుంచి నష్టాల్లోకి.. స్టాక్ మార్కెట్లకు నష్టాలు..
Stock Market

గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయ సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఉదయం లాభాలతో ప్రారంభమై చివరకు నష్టాలతో ముగిశాయి. ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాలు కూడా సూచీలను కిందకు లాగాయి. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చుకుంటే ఏకంగా 750 పాయింట్లను కోల్పోయింది (Indian stock market).


గత సెషన్ ముగింపు (78,111)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 500 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత కిందకు వచ్చి ఇక కోలుకోలేకపోయింది. చివరకు సెన్సెక్స్ 122 పాయింట్ల నష్టంతో 77,988 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 34 పాయింట్ల నష్టంతో 24,196 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో భెల్, అదానీ పవర్, సీజీ కన్జ్యూమర్, పీబీ ఫిన్‌టెక్, కేన్స్ టెక్నాలజీస్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). సుప్రీమ్ ఇండస్ట్రీస్, అస్ట్రాల్ లిమిటెడ్, జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్, హీరో మోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 215 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 369 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 93.20గా ఉంది.


ఇవి కూడా చదవండి

వేగంగా తినే అలవాటు బరువు పెరగడానికి కారణమవుతుందా?

'దోశ, ఇడ్లీ' పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు..

Updated Date - Apr 16 , 2026 | 03:59 PM