Share News

వేలాది అమెరికా సైనికులను బందీలుగా పట్టుకుంటాం: ఇరాన్ హెచ్చరిక

ABN , Publish Date - Apr 16 , 2026 | 02:40 PM

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న నిర్బంధంపై ఇరాన్ తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నిర్బంధం ఇలాగే కొనసాగితే వేలాది మంది అమెరికా సైనికులను బందీలుగా తీసుకునే అవకాశం ఉందని ఇరాన్ స్పష్టం చేసింది.

వేలాది అమెరికా సైనికులను బందీలుగా పట్టుకుంటాం: ఇరాన్ హెచ్చరిక
Iran hostage warning US troops

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న నిర్బంధంపై ఇరాన్ తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నిర్బంధం ఇలాగే కొనసాగితే వేలాది మంది అమెరికా సైనికులను బందీలుగా తీసుకునే అవకాశం ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా నౌకాదళ ఆంక్షలు అమలు చేస్తోంది. ఇరాన్ పోర్ట్‌లను దిగ్బంధనం చేస్తోంది (Iran hostage warning US troops).


ఇరాన్ పోర్టుల నుంచి బయటకు వచ్చే, లోపలకి వెళ్లే నౌకలను అమెరికా సైన్యం అడ్డుకుంటోంది. దీని వల్ల ఇరాన్ సముద్ర వాణిజ్యానికి తీవ్రం ఆటంకం కలుగుతోంది. హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిర్బంధం కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తే తాము ప్రయోగించే తొలి క్షిపణి దాడికే అమెరికా నౌకలు మునిగిపోతాయని వార్నింగ్ ఇచ్చింది (Hormuz blockade Iran threat).


'హోర్ముజ్‌కు రక్షక భుటుడిగా మారాలని ట్రంప్ అనుకుంటున్నారు. అమెరికా వంటి శక్తివంతమైన సైన్యం చేయాల్సిన పనేనా ఇది (US Iran tensions 2026). హోర్ముజ్‌పై ఆధిపత్యం చూపాలని చూస్తే.. మా తొలి క్షిపణి దాడికే మీ నౌకలు మునిగిపోతాయి. అక్కడ ఉన్న అమెరికా సైనికుల ప్రాణాలు కూడా పోతాయి. ఇరాన్‌లో భూతల దాడుల కోసం వచ్చిన అమెరికా సైనికులను బందీలుగా పట్టుకుంటాం' అని ఇరాన్ సుప్రీం లీడర్ సైనిక సలహాదారుడు మోహ్‌సేన్ రెజాయి హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

ఆ విషయాల్లో మహిళల పాత్రకు ప్రత్యామ్నాయం లేదు: పవన్ కల్యాణ్

జగన్‌కు ఉన్న ప్రేమ ఒక్కటే గొడ్డలి పార్టీ.. గొడ్డలి గుర్తు: మంత్రి కొల్లు రవీంద్ర

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 16 , 2026 | 03:27 PM