Share News

అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు.. సమాచారం లేదంటున్న పాకిస్థాన్

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:48 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు అమెరికా-ఇరాన్ రెండో సారి శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి. మొదటి విడత చర్చలు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగాయి. ఆ చర్చలు స్పష్టమైన ఒప్పందం లేకుండానే ముగిశాయి.

అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు.. సమాచారం లేదంటున్న పాకిస్థాన్
US Iran talks second round

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు అమెరికా-ఇరాన్ రెండో సారి శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి. మొదటి విడత చర్చలు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగాయి. ఆ చర్చలు స్పష్టమైన ఒప్పందం లేకుండానే ముగిశాయి. అయినప్పటికీ, రెండు దేశాలు మళ్లీ చర్చలు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ వారం రోజుల్లోనే ఆ చర్చలు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. (US Iran talks second round).


రెండో దఫా శాంతి చర్చలు ఎక్కడ నిర్వహిస్తారన్న విషయంపై తమకు ఎలాంటి సమాచారమూ లేదని పాకిస్థాన్ వెల్లడించింది. రెండో విడత చర్చలు జరగనున్నాయి కానీ, వాటి తేదీ, వేదిక ఇంకా ఖరారు కాలేదని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల ప్రక్రియలో మొదటి నుంచి పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇరు పక్షాల మధ్య సమాచార వారధిలా పని చేస్తోంది. అందువల్లే తొలి విడత చర్చలు పాకిస్థాన్‌లో జరిగాయి (Pakistan mediation US Iran).


రెండో విడత చర్చలు కూడా త్వరలోనే జరగబోతున్నాయి. అయితే ఇంకా తేదీ, వేదిక ఖరారు కాలేదు (US Iran negotiations 2026). కాగా, ఈ చర్చలు ముందుకు సాగడంలో కొన్ని కీలక అవరోధాలు కనబడుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలు, హోర్ముజ్‌ను పూర్తిగా తెరవడం, ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయడం మొదలైన అంశాల గురించి చర్చలకు ముందే క్లారిటీ రావాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి

వేగంగా తినే అలవాటు బరువు పెరగడానికి కారణమవుతుందా?

'దోశ, ఇడ్లీ' పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు..

Updated Date - Apr 16 , 2026 | 03:48 PM