Share News

ఏపీకి 38.. తెలంగాణకు 26.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న లోక్‌సభ స్థానాలు..

ABN , Publish Date - Apr 16 , 2026 | 07:21 PM

లోక్‌సభలో మహిళల రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ప్రచారం తప్పని, డీలిమిటేషన్ వల్ల ఆ రాష్ట్రాలకు తగిన రీతిలో సీట్లు పెరుగుతాయని వివరించారు.

ఏపీకి 38.. తెలంగాణకు 26.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న లోక్‌సభ స్థానాలు..
Amit Shah delimitation seats

లోక్‌సభలో మహిళల రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ప్రచారం తప్పని, డీలిమిటేషన్ వల్ల ఆ రాష్ట్రాలకు తగిన రీతిలో సీట్లు పెరుగుతాయని వివరించారు. డీలిమిటేషన్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగదని అమిత్ షా స్పష్టం చేశారు (Amit Shah delimitation seats).


డీలిమిటేషన్ తర్వాత ఏపీలో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయని అమిత్‌ షా వెల్లడించారు (Lok Sabha seat increase). అలాగే తెలంగాణలో లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కి పెరుగుతాయన్నారు. ఇక, తమిళనాడులో 39 నుంచి 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కి, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయన్నారు. మొత్తంగా 50 శాతం సీట్లు పెరుగుతాయన్నారు.


దక్షిణాది జనాభా శాతం కంటే సీట్లు ఎక్కువగా పెరుగుతాయని అమిత్ షా చెప్పారు. విపక్షాలు అబద్ధాలు చెబుతూ ప్రజలను అనవసరంగా ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. అన్ని ప్రాంతాలకూ సమాన న్యాయం జరుగుతుందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం 543 ఉన్న లోక్‌సభ సీట్లను డీలిమిటేషన్ తర్వాత దాదాపు 50% పెంచి 850 వరకు తీసుకెళ్లే ప్రణాళిక ఉందని కేంద్రం తెలిపింది.


ఇవి కూడా చదవండి..

అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు.. సమాచారం లేదంటున్న పాకిస్థాన్


వేలాది అమెరికా సైనికులను బందీలుగా పట్టుకుంటాం: ఇరాన్ హెచ్చరిక


లాభాల నుంచి నష్టాల్లోకి.. స్టాక్ మార్కెట్లకు నష్టాలు..

Updated Date - Apr 16 , 2026 | 07:26 PM