పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను ఎస్‌ఎమ్‌సీలకు అప్పగించండి: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Apr 16 , 2026 | 08:23 PM
పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో గురువారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను ఎస్‌ఎమ్‌సీలకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు.
అమరావతి, ఏప్రిల్ 16: పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో గురువారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను ఎస్‌ఎమ్‌సీలకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను 3 స్టార్‌కు చేర్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల పెంపుదలకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లో అత్యుత్తమ మార్కులపై ప్రచారం కల్పించాలని అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.
నాణ్యమైన విద్యా బోధనకు ముఖ ఆధారిత హాజరు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. ఉన్నత విద్యా సంస్థల్లో మరింత పారదర్శకత కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్యా సంస్థల వివరాలతో పాటు సిబ్బంది, విద్యార్థుల ముఖ ఆధారిత గుర్తింపు కోసం ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై మంత్రి ఆరా తీశారు.
ఇవి కూడా చదవండి
ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..
ఏపీకి 38.. తెలంగాణకు 26.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న లోక్‌సభ స్థానాలు..