Share News

ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..

ABN , Publish Date - Apr 16 , 2026 | 07:41 PM

రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు, నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..
AP Municipal Commissioners Transfers

అమరావతి: రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు, నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.


  • విజయవాడ జోనల్ కమిషనర్ రమ్య కీర్తన – నరసరావుపేట మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ

  • వినుకొండ మేనేజర్ అర్జునరావు – దర్శి మున్సిపల్ కమిషనర్‌గా నియామకం

  • పులివెందుల ఇన్‌ఛార్జ్ కమిషనర్ మునికుమార్ – రెగ్యులర్ కమిషనర్‌గా పదోన్నతి

  • విజయవాడ నుంచి సుభాష్ చంద్రబోస్ – వుయ్యూరు మున్సిపల్ కమిషనర్‌గా పోస్టింగ్

  • వుయ్యూరు కమిషనర్ జె.రామారావు – తెనాలి అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ

  • విశాఖ జీఎంసీ దక్షిణ జోన్‌కు పీవీవీడీ ప్రసాద్ రావు – జోనల్ కమిషనర్‌గా నియామకం

  • మల్లయ్య నాయుడు – గుంటూరు కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా బదిలీ

  • గుంటూరు అదనపు కమిషనర్ ఒబులేసు – కర్నూలు కమిషనర్‌గా నియామకం

  • కర్నూలు కమిషనర్ విశ్వనాథ్ – తదుపరి పోస్టింగ్ కోసం సిడిఎంఏ, రాయపూడిలో రిపోర్ట్ చేయాలనీ ఆదేశం

  • తిరుపతి రెవెన్యూ అధికారులు లోకేశ్వర వర్మ, చిట్టిబాబు – యూఏడీఏల్లో కీలక పోస్టింగ్స్

  • గుంటూరు, కర్నూలు సానిటరీ ఇన్స్పెక్టర్లకు ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు

  • పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్‌గా శ్రీనివాస్ నియామకం

  • పుట్టపర్తి కమిషనర్ కాంతి కుమార్ – హిందూపురం అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ

  • అదోని రెవెన్యూ ఆఫీసర్ బేబీ – ఆత్మకూరు (కె) కమిషనర్‌గా పోస్టింగ్

అలాగే, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పలువురు అధికారులకు కూడా కీలక నియామకాలు కల్పించారు. ఈ మొత్తం బదిలీలు, నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.


ఇవి కూడా చదవండి...

జగన్‌కు ఉన్న ప్రేమ ఒక్కటే గొడ్డలి పార్టీ.. గొడ్డలి గుర్తు: మంత్రి కొల్లు రవీంద్ర

టీడీపీలో ఎన్నో సంస్కరణలకు లోకేశ్ శ్రీకారం: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Read Latest AP News

Updated Date - Apr 16 , 2026 | 07:54 PM