స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు.. 1,533 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:18 PM
అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. ఈ రోజు(గురువారం) భారతదేశ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ అత్యధికంగా 1500 పాయింట్ల వరకు పెరిగి, లాభాలతో ముగిసింది.
బిజినెస్ డెస్క్: ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు స్పల్ప లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 330 పాయింట్లు ఉండగా.. నిఫ్టీ 41 పాయింట్లుగా ఉంది. కాగా.. ట్రేడింగ్ ప్రారంభమైన ఒక గంటలోనే.. సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లకు పెరిగింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,533 పాయింట్లకు ఎగబాకి 74,315 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 374.65 పాయింట్లు పెరిగి, 22,997 వద్ద లాభాలతో ముగిసింది.
ఈ వార్తలనూ చదవండి:
సిబిల్ స్కోర్ పడిపోయిందా..? ఆరు నెలల్లో పెంచుకోండిలా
ఫెయిర్ఫాక్స్ చేతికి ఐడీబీఐ బ్యాంకు