Share News

ప్రపంచ స్థాయి వ్యాపార కేంద్రంగా హైదరాబాద్‌

ABN , Publish Date - Apr 30 , 2026 | 07:49 AM

హైదరాబాద్‌ కేవలం ఐటీ డెస్టినేషన్‌గా మాత్రమే కాకుండా.. ప్రపంచ స్థాయి వ్యాపార కేంద్రంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

ప్రపంచ స్థాయి వ్యాపార కేంద్రంగా హైదరాబాద్‌
Minister Sridhar Babu

  • ‘హైనెకెన్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ ఇండియా’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేవలం ఐటీ డెస్టినేషన్‌గా మాత్రమే కాకుండా.. ప్రపంచ స్థాయి వ్యాపార కేంద్రంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. అందుకే అంతర్జాతీయ ఐటీ దిగ్గజాల మొదలు మ్యానుఫ్యాక్చరింగ్‌, కన్స్యూమర్‌ గూడ్స్‌ కంపెనీల వరకు తమ వ్యూహాత్మక కేంద్రాల ఏర్పాటు కోసం హైదరాబాద్‌నే మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయన్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రూయింగ్‌ కంపెనీ హైనెకెన్‌ నానక్‌ రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌లో ‘హైనెకెన్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ ఇండియా’ పేరిట 76వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన జీసీసీని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.


city2.jpgఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను కేవలం ‘బ్యాక్‌ ఆఫీస్‌’ ఆపరేషన్లకే పరిమితం కాకుండా... స్ర్టాటెజిక్‌ ఇన్నోవేషన్స్‌, హై వాల్యూ ప్రొడక్టివిటీకి కేంద్రాలైన గ్లోబల్‌ వాల్యూ సెంటర్లు (జీవీసీ)గా మార్చేలా కాంప్రహెన్సివ్‌ రోడ్డు మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. మరిన్ని అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేలా ‘రెడీ టూ వర్క్‌ ఫోర్స్‌’, ఇన్నోవేషన్‌ ఎకో సిస్టం బలోపేతంపై దృష్టి సారించామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..

మండుతున్న ఎండలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2026 | 09:07 AM