ముంబై ఇండియన్స్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిన రికెల్టన్
ABN , Publish Date - Apr 30 , 2026 | 07:30 AM
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ర్యాన్ రికెల్టన్ ఆడిన ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. రికెల్టన్ కేవలం 44 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న(బుధవారం) జరిగిన మ్యాచ్‌లో ర్యాన్ రికెల్టన్(Ryaan Rickelton) ఆడిన ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. రికెల్టన్ కేవలం 44 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డు 18 ఏళ్లుగా సనత్ జయసూర్య ఖాతాలో ఉండింది. 2008లో జయసూర్య ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ సీఎస్కేపై 45 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ రికార్డును రికెల్టన్ ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో బద్దలు కొట్టాడు.
ఐపీఎల్‌లో ముంబై తరఫున వేగవంతమైన సెంచరీలు
ర్యాన్ రికెల్టన్(44 బంతులు )
సనత్ జయసూర్య(45 బంతులు )
తిలక్ వర్మ(45 బంతులు)
కెమెరూన్ గ్రీన్(47 బంతులు )
ఈ శతకంతో రికెల్టన్ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల తరఫున అన్ని టీ20 లీగ్‌ల్లో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ముంబై స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్ 2 సెంచరీలు (ముంబై ఇండియన్స్) చేయగ్గా.. రికెల్టన్ ఎంఐ ఫ్రాంచైజీల (ముంబై ఇండియన్స్, ఎంఐ కేప్‌టౌన్) తరఫున మొత్తం 3 సెంచరీలు చేశాడు. 2025లో రికెల్టన్ ముంబై ఇండియన్స్ లో చేరాడు. ఐపీఎల్ 2025 వేలంలో కేవలం రూ.1 కోటికే అతడిని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. నిన్న ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తం 55 బంతులు ఎదుర్కొన్న రికెల్టన్ 123 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్‌లో ముంబై తరఫున అత్యధిక స్కోర్
ర్యాన్ రికెల్టన్-123*
సనత్ జయసూర్య-114*
క్వింటన్ డికాక్-112*
రోహిత్ శర్మ-109*, 105*
సూర్యకుమార్ యాదవ్-103*
ఇవి కూడా చదవండి:
అవును..భగవంతుడే ఆ బ్యాటిచ్చాడు