Share News

ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి..

ABN , Publish Date - Apr 30 , 2026 | 07:01 AM

కూలీలను తీసుకెళుతున్న వ్యాన్ బోల్తా పడి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి మధ్యప్రదేశ్‌లో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి..
Madhya Pradesh accident

భోపాల్, ఏప్రిల్ 30: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలను తీసుకెళుతున్న వ్యాన్ బోల్తా పడి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ధార్ జిల్లాలోని బగ్గద్ నుంచి 35 మంది కూలీలు పికప్ వ్యాన్‌లో ఇంటికి వస్తున్నారు. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చిక్లియా క్రాసింగ్ దగ్గర డ్రైవర్ వ్యాన్ కంట్రోల్ కోల్పోయాడు.


దీంతో వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆ వెంటనే ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ప్రథమ చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. 12 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి 50 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పీఎంఓ ఆఫీస్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టింది.

ఇవి కూడా చదవండి

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..

Updated Date - Apr 30 , 2026 | 07:13 AM