244..ఉఫ్
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:58 AM
ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76), హెన్రిచ్ క్లాసెన్ (30 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 నాటౌట్) అదిరే అర్ధ శతకాలతో.. ఐపీఎల్‌లో నాలుగో అత్యధిక లక్ష్యాన్ని సన్‌రైజర్స్...
నేటి మ్యాచ్
గుజరాత్ X బెంగళూరు
వేదిక అహ్మదాబాద్ రా.7.30 నుంచి
18.4 ఓవర్లలోనే ఊదేసిన సన్‌రైజర్స్
హెడ్, క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్
ముంబైకి తప్పని ఓటమి
రికెల్టన్ సూపర్ సెంచరీ వృథా
ముంబై: ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76), హెన్రిచ్ క్లాసెన్ (30 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 నాటౌట్) అదిరే అర్ధ శతకాలతో.. ఐపీఎల్‌లో నాలుగో అత్యధిక లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఛేదించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లతో ముంబై ఇండియన్స్‌ను ఓడించిన సన్‌రైజర్స్.. లీగ్‌లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోరు చేసింది. ర్యాన్ రికెల్టన్ (55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 123 నాటౌట్) సూపర్ సెంచరీ చేశాడు. విల్ జాక్స్ (22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) రాణించారు. ప్రఫుల్ హింగే 2 వికెట్లు పడగొట్టాడు. భారీ ఛేదనలో సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలోనే 249/4 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45), సలీల్ అరోరా (10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30 నాటౌట్) సత్తా చాటారు. ఘజన్‌ఫర్ 2 వికెట్లు తీశాడు. క్లాసెన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
జోరు.. తగ్గకుండా..
హెడ్, క్లాసెన్ హాఫ్ సెంచరీలతో విరుచుకుపడడంతో.. భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్, హెడ్ తొలి వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు ధనాధన్ ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ పోటీపడి మరీ షాట్లు ఆడడంతో.. పవర్‌ప్లేలో హైదరాబాద్ 92/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాతి ఓవర్‌లో హెడ్ సిక్స్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకొన్నాడు. అయితే, 9వ ఓవర్‌లో అభిషేక్, ఇషాన్ కిషన్ (0)ను వరుస బంతుల్లో అవుట్ చేసిన ఘజన్‌ఫర్ దెబ్బకొట్టాడు. ఇక, తర్వాతి ఓవర్లోనే హెడ్‌ను హార్దిక్ క్యాచవుట్ చేయడంతో.. సన్‌రైజర్స్ ఇబ్బందుల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో జత కలసిన క్లాసెన్, నితీశ్ (21) ఐదో వికెట్‌కు 80 పరుగులు జోడించడంతో.. సన్‌రైజర్స్ గెలుపు దిశగా సాగింది. క్లాసెన్ ఎదురుదాడి చేయగా.. నితీశ్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలో 16వ ఓవర్‌లో సిక్స్‌తో క్లాసెన్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. లక్ష్యం చివరి 4 ఓవర్లలో 32 పరుగులకు దిగొచ్చింది. నితీశ్‌ను బౌల్ట్ పెవిలియన్ చేర్చినా.. క్లాసెన్, సలీల్ అరోరా 8 బంతులు ఉండగానే మ్యాచ్‌ను ముగించారు.

ఓపెనింగ్ అదిరింది..
రికెల్టన్ విధ్వంసకర శతకంతో చెలరేగడంతో.. ముంబై భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న ముంబైకి ఓపెనర్లు విల్ జాక్స్, రికెల్టన్ దూకుడైన ఆరంభాన్నిచ్చారు. పవర్‌ప్లేలో వీరిద్దరూ ఎడాపెడా షాట్లతో విరుచుకుపడడంతో.. ఆరు ఓవర్లలో ముంబై 78/0తో నిలిచింది. అయితే, ఎనిమిదో ఓవర్‌లో జాక్స్‌ను నితీశ్ అవుట్ చేయడంతో.. తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ (5)ను మలింగ స్వల్ప స్కోరుకే వెనక్కిపంపాడు. అయితే, నమన్ ధిర్ (22)తో కలసి రికెల్టన్ మూడో వికెట్‌కు 55 పరుగులతో ఆదుకొనే ప్రయత్నం చేశాడు. 14వ ఓవర్లో నమన్‌ను ప్రఫుల్ పెవిలియన్ చేర్చాడు. కానీ, జోరు తగ్గని రికెల్టన్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మరో ఎండ్‌లో హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝుళిపించడంతో డెత్ ఓవర్లలో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. హింగే వేసిన 16వ ఓవర్‌లో పాండ్యా మూడు ఫోర్లు, సిక్స్‌తో 21 పరుగులు పిండుకొన్నాడు. కీలక సమయంలో పాండ్యాను అవుట్ చేసిన సకీబ్.. నాలుగో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆఖరి ఓవర్‌లో తిలక్ వర్మ (7)ను హింగే వెనక్కి పంపినా.. రికెల్టన్ 4,6తో జట్టు స్కోరును 240 మార్క్ దాటించాడు.
స్కోరుబోర్డు
ముంబై: జాక్స్ (సి) ఇషాన్ (బి) నితీశ్ 46, రికెల్టన్ (నాటౌట్) 123, సూర్యకుమార్ (సి) అభిషేక్ (బి) మలింగ 5, నమన్ (సి) దూబే (బి) ప్రఫుల్ హింగే 22, హార్దిక్ (సి) క్లాసెన్ (బి) సకీబ్ 31, తిలక్ (సి) క్లాసెన్ (బి) ప్రఫుల్ హింగే 7, రాబిన్ మిన్జ్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 243/5; వికెట్ల పతనం: 1-93, 2-110, 3-165, 4-221, 5-232; బౌలింగ్: కమిన్స్ 4-0-39-0, ప్రఫుల్ హింగే 4-0-54-2, మలింగ 4-0-29-1, హర్ష్ దూబే 3-0-50-0, సకీబ్ హుస్సేన్ 3-0-39-1, నితీశ్ 2-0-31-1.
సన్‌రైజర్స్: అభిషేక్ (సి) బౌల్ట్ (బి) ఘజన్‌ఫర్ 45, హెడ్ (సి) జాక్స్ (బి) హార్దిక్ 76, ఇషాన్ (బి) ఘజన్‌ఫర్ 0, క్లాసెన్ (నాటౌట్) 65, నితీశ్ (సి) సూర్య (బి) బౌల్ట్ 21, సలీల్ (నాటౌట్) 30, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 18.4 ఓవర్లలో 249/4; వికెట్ల పతనం: 1-129, 2-129, 3-133, 4-213; బౌలింగ్: బౌల్ట్ 4-0-41-1, బుమ్రా 4-0-54-0, జాక్స్ 1-0-19-0, ఘజన్‌ఫర్ 4-0-51-2, అశ్వని 2-0-41-0, హార్దిక్ 3.4-0-39-1.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
పంజాబ్ 8 6 1 1 13 1.043
బెంగళూరు 8 6 2 0 12 1.919
హైదరాబాద్ 9 6 3 0 12 0.832
రాజస్థాన్ 9 6 3 0 12 0.617
గుజరాత్ 8 4 4 0 8 -0.475
చెన్నై 8 3 5 0 6 -0.121
ఢిల్లీ 8 3 5 0 6 -1.060
కోల్‌కతా 8 2 5 1 5 -0.751
ముంబై 8 2 6 0 4 -0.784
లఖ్‌నవూ 8 2 6 0 4 -1.106
ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు
ఇవి కూడా చదవండి:
సల్మాన్ ఖాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై.. వీడియో వైరల్
Read Latest Telangana News and National News