అవును..భగవంతుడే ఆ బ్యాటిచ్చాడు
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:57 AM
క్రికెట్ తాజా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రతిభను పండితులంతా వేనోళ్లా కొనియాడుతున్నారు. ఈసారి ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్.. ప్రత్యర్థి జట్టు బౌలర్లందరి భరతం పడుతూ...
పాక్ విశ్లేషకుడికి వైభవ్ కౌంటర్
న్యూఢిల్లీ: క్రికెట్ తాజా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రతిభను పండితులంతా వేనోళ్లా కొనియాడుతున్నారు. ఈసారి ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్.. ప్రత్యర్థి జట్టు బౌలర్లందరి భరతం పడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో 238.09 స్ట్రయిక్ రేట్‌తో సూర్యవంశీ 400 పరుగులు కొల్లగొట్టాడు. కానీ పాకిస్థాన్ క్రికెట్ విశ్లేషకుడు నౌమాన్ నియాజ్ మాత్రం వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందంటూ ఆక్రోశం వెళ్లగక్కాడు. అందుకే అతడు అలవోకగా సిక్సర్లు కొడుతున్నాడని నోరు పారేసుకున్నాడు. అయితే నౌమాన్‌కు వైభవ్ తిరుగులేని కౌంటర్ ఇచ్చాడు. ‘ఆ భగవంతుడే నా బ్యాటులో ఏదో పెట్టాడు. పైగా..నా బ్యాటులో ఏదో పెట్టానని ఆయనే పైనుంచి నాకు ముందే చెప్పాడు. ఆ బ్యాటునే నేను ఉపయోగిస్తున్నా’ బదులిచ్చాడు.
ఇవి కూడా చదవండి:
సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. ఎంఐ గెలుపు బాట పడుతుందా?
సల్మాన్ ఖాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై.. వీడియో వైరల్