Share News

ఐడీబీఐ బ్యాంకులో ఫెయిర్‌ఫాక్స్ కంపెనీకి 60.72 శాతం వాటా.. క్యాబినెట్ ఆమోదం

ABN , Publish Date - Oct 14 , 2026 | 08:27 PM

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను కెనడా కంపెనీ ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు అమ్మేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.52,878 కోట్లకు 60.72 శాతం వాటాను ఫెయిర్‌ఫాక్స్‌కు కేంద్రం విక్రయించనుంది.

ఐడీబీఐ బ్యాంకులో ఫెయిర్‌ఫాక్స్ కంపెనీకి 60.72 శాతం వాటా.. క్యాబినెట్ ఆమోదం

ఇంటర్‌నెట్ డెస్క్: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను కెనడా కంపెనీ ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు అమ్మేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.52,878 కోట్లకు 60.72 శాతం వాటాను ఫెయిర్‌ఫాక్స్‌కు కేంద్రం విక్రయించనుంది. ఎయిర్ ఇండియా అమ్మకం తర్వాత ఒక ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించుకోనుంది. ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను విక్రయించాలని కేంద్రం గత కొంతకాలంగా కసరత్తు చేసింది.


కాగా.. ఫెయిర్‌ఫాక్స్ పొందుతున్న 60.72 శాతం వాటాలో కేంద్ర ప్రభుత్వానికి 30.48 శాతం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కు 30.24 శాతం వాటా దక్కనుంది. ప్రతి షేర్‌కు రూ.81 చొప్పున బిడ్‌ను ఫెయిర్‌ఫాక్స్ గెలుచుకుంది. వాటాకు సంబంధించిన విక్రయం పూర్తయితే.. దేశ ఆర్థిక రంగంలో ఇది అతిపెద్ద ఎఫ్‌డీఐగా నిలవనుందని కేంద్రం తెలిపింది. ఈ వాటాల విక్రయంతో ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ వాటా వచ్చే రెండేళ్లలో 19 నుంచి 15 శాతానికి పడిపోనుంది. మిగిలిపోయిన ప్రభుత్వ వాటాను బహిరంగ మార్కెట్ ద్వారా విక్రయిస్తారు. కాగా.. ఫెయిర్‌ఫాక్స్‌కు అంతపెద్ద మొత్తంలో వాటాలు విక్రయించడం పెట్టుబడుల ఉపసంహరణ కాదని, అదొక ‘స్ట్రాటజిక్ రీస్ట్రక్చరింగ్’ (వ్యూహాత్మక పునర్నిర్మాణం) అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వాటాల విక్రయం జరిగినా ఆ బ్యాంకులో ప్రభుత్వానికి, ఎల్ఐసీకి వాటాలు ఉంటాయని ఆమె తెలిపారు.


ఇవి కూడా చదవండి:

తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్

ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి

పోలీసుల దాడుల్లో ఓ విద్యార్థిని వినికిడి శక్తి కోల్పోయింది.. దీనికి బాధ్యులెవరు? : రాహుల్ గాంధీ

Updated Date - Oct 14 , 2026 | 08:50 PM