అంతర్జాతీయ అనిశ్చితితోనే రూపాయికి తిప్పలు
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:56 AM
భారత స్థూల ఆర్థిక పునాదులు ఇప్పటికీ పటిష్ఠంగానే ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ప్రకటించారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం రేటులో...
పతనాన్ని అడ్డుకునేందుకు
ఆర్బీఐ చర్యలు షురూ
మూలధన లాభాల పన్నులపై విజ్ఞప్తులు వింటున్నా..
న్యూఢిల్లీ: భారత స్థూల ఆర్థిక పునాదులు ఇప్పటికీ పటిష్ఠంగానే ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ప్రకటించారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం రేటులో చోటు చేసుకుంటున్న భారీ ఆటుపోట్లకు అంతర్జాతీయ అనిశ్చితే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. అయినా డాలర్‌తో సహా ప్రధాన కరెన్సీలతో రూపాయి మారకం రేటును స్థిరీకరించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ చర్యల కారణంగానే గత రెండు రోజుల్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు ఒక శాతానికిపైగా పెరిగినట్టు తెలిపారు. రూపాయి మారకం రేటు ను స్థిరీకరించేందుకు.. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునేందుకు కూడా ఆర్బీఐ సిద్ధంగా ఉందన్నారు. ‘బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ 2027’ సదస్సులో సీతారామన్ ఈ విషయాలు చెప్పారు. డాలర్‌తో రూపాయి మారకానికి ఒక స్థిరమైన ధర నిర్ణయించే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
మూలధన పన్నులపై ఆలోచిస్తున్నాం..
స్వల్ప, దీర్ఘకాలిక పన్నుల హేతుబద్దీకరణపై జరుగుతున్న చర్చలను ఆర్థిక మంత్రి సీతారామన్ స్వాగతించారు. దేశ, విదేశీ మదుపరుల నుంచి తనకు ఈ విషయంలో విజ్ఞప్తులు అందుతున్నట్టు తెలిపారు. అయితే వచ్చే ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ఉన్నందున ఈ విషయం మీద ప్రస్తుతం తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనన్నారు. మరోవైపు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీటీ) రద్దు చేస్తే తప్ప ఎఫ్‌పీఐల పెట్టుబడులను ఆకర్షించలేమని ఎస్బీఐ రీసెర్చి సంస్థ మంగళవారం విడుదల చేసిన ఒక నివేదికలో స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్
నాసా–స్పేస్ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ISSకు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక
వాదిస్తే నిజాలు అబద్ధాలు కావు.. లద్దాఖ్‌పై చైనాకు భారత్ కౌంటర్