Share News

ఎల్‌ఐసీ నుంచి మూడు కొత్త ప్లాన్లు

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:54 AM

భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మంగళవారం మూడు కొత్త ప్లాన్లను విడుదల చేసింది. వీటిలో న్యూజీవన్‌ ధారా-2, హెల్త్‌షీల్డ్‌, న్యూ క్యాన్సర్‌ కవర్‌ ప్లాన్లున్నాయి...

ఎల్‌ఐసీ నుంచి మూడు కొత్త ప్లాన్లు

న్యూఢిల్లీ: భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మంగళవారం మూడు కొత్త ప్లాన్లను విడుదల చేసింది. వీటిలో న్యూజీవన్‌ ధారా-2, హెల్త్‌షీల్డ్‌, న్యూ క్యాన్సర్‌ కవర్‌ ప్లాన్లున్నాయి. న్యూజీవన్‌ ధారా-2 అనేది నాన్‌-పార్‌, నాన్‌-లింక్డ్‌, వ్యక్తిగత, పొదుపు, డిఫర్డ్‌ యాన్యూటీ ప్లాన్‌. ఇది పదవీ విరమణ తర్వాత హామీతో కూడిన ఆదాయాన్ని అందిస్తుంది. హెల్త్‌షీల్డ్‌ ప్లాన్‌.. మొత్తం కుటుంబానికి సమగ్ర కవరేజీని అందజేస్తుంది. ఆస్పత్రిలో చేరిన సందర్భంలో ఫిక్స్‌డ్‌ రోజువారీ నగదు ప్రయోజనం అందిస్తుంది. పెద్ద సర్జరీలు, తీవ్రమైన అనారోగ్యాలకు ఒకేసారి చెల్లింపులను అందిస్తుందని ఎల్‌ఐసీ తెలిపింది. ఇక క్యాన్సర్‌ కవర్‌ ప్లాన్‌.. బీమా తీసుకున్న వ్యక్తికి అయ్యే వాస్తవ చికిత్స ఖర్చుతో సంబంధం లేకుండా క్యాన్సర్‌ నిర్ధారణ అయినప్పుడు స్థిరమైన ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుందని పేర్కొంది. వయోపరిమితిని బట్టి కనీస ప్రాథమిక హామీ మొత్తం రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఉంటుందని తెలిపింది. ఈ ప్లాన్‌ కింద ఇప్పటికే ఉన్న అన్ని పాలసీలను పరిగణనలోకి తీసుకుని గరిష్ఠ బీమా మొత్తం రూ.50 లక్షలు ఉంటుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్

నాసా–స్పేస్‌ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ISSకు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక

వాదిస్తే నిజాలు అబద్ధాలు కావు.. లద్దాఖ్‌పై చైనాకు భారత్ కౌంటర్

Updated Date - Oct 14 , 2026 | 05:54 AM